ప్రత్యేకం : సింగర్ అవతారం ఎత్తనున్న బాలకృష్ణ

ప్రత్యేకం : సింగర్ అవతారం ఎత్తనున్న బాలకృష్ణ

Published on Nov 27, 2014 1:15 PM IST

bala-krishna1
నందమూరి బాలకృష్ణ ఈ పేరంటే పవర్ఫుల్ డైలాగ్స్ కి, మాస్ సినిమాలకి పెట్టింది పేరనే చెప్పాలి.. ఇప్పటి వరకూతన పెర్ఫార్మన్స్, పవర్ఫుల్ డైలాగ్స్ తో ఆకట్టుకున్న బాలకృష్ణ మొదటిసారి సింగర్ గా కూడా మారనున్నాడు. కానీ అది ఒక సినిమా కోసం కాకుండా ఓ మంచి కారణం కోసం తన గళం విప్పి సింగర్ గా మారనున్నాడు. ఆ మంచి కారణం పేరే ‘మేము సైతం’.

తెలుగు పరిశ్రమలోని వారంతా నవంబర్ 30వ తేదీన జరగనున్న ‘మేము సైతం’ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా పలు ప్రోగ్రామ్స్ కూడా చేయనున్నారు. ఇలా పలు ప్రోగ్రామ్స్ చేస్తున్న వారి లిస్టులో నందమూరి బాలకృష్ణ కూడా చేరాడు. మ్యూజిక్ డైరెక్టర్ కోఠి అండ్ టీంతో కలిసి స్టేజ్ మీద నందమూరి బాలకృష్ణ రెండు పాటలను పాడనున్నాడు. అంతే కాకుండా ‘లెజెండ్’ ఫేం సోనాల్ చౌహాన్ తో కలిసి ఓ స్పెషల్ ప్రోగ్రాం కూడా చెయ్యడానికి సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం ఈ రెండిటికి సంబందించిన రిహార్సల్స్ పై బాలకృష్ణ దృష్టి సారించాడు.

నవంబర్ 30వ తేదీన 12 గంటల పాటు కంటిన్యూగా జరిగే లైవ్ ప్రోగ్రాం ని జెమిని టీవీ వారు లైవ్ గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు