ప్రత్యేక చిట్ చాట్ : మనోజ్ – సునీల్ గారి మూవీలో నేనొక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది.

ప్రత్యేక చిట్ చాట్ : మనోజ్ – సునీల్ గారి మూవీలో నేనొక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది.

Published on Jul 17, 2014 8:05 PM IST

manoj
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమై, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోల చిన్నప్పటి పాత్రలో నటించిన మనోజ్ నందం ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ మరోసారి పి. సునీల్ కుమార్ రెడ్డితో కలిసి చేసిన సినిమా ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’. జూలై 18న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా మనోజ్ తో కాసేపు చిట్ చాట్ చేసాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ‘రొమాంటిక్ క్రైమ్ కథ’ సినిమా తర్వాత మళ్ళీ సునీల్ కుమార్ రెడ్డితో పనిచేయడం ఎలా ఉంటుంది.?

స) ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ తర్వాత మళ్ళీ సునీల్ కుమార్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన సొసైటీలో మార్పు కోసం చేసే సినిమాల్లో నేను ఒక భాగం అయినందుకు చాలా చాలా హ్యాపీ. ప్రతి సంవత్సరం ఆయనతో ఓ సినిమా ఉంటుంది. ఆయనతో కంటిన్యూగా సినిమాలు చేయడం లక్కీగా ఫీలవుతున్నాను.

ప్రశ్న) ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ తో పోల్చుకుంటే ఈ సినిమాలో మీ పాత్రలో ఉన్న కొత్తదనం ఏమిటి?

స) ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’లో నా పాత్ర చాలా రిజర్వ్డ్ గా, తక్కువ డైలాగ్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాలో దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. చాలా అమాయకుడు, అరిస్తేనే భయపడి పోతాడు. కెమెరామెన్ దగ్గర లైట్ పని చేస్తూ తన పని తానూ చేసుకునే కుర్రాడు. అలాంటి వాడు ఒక అమ్మాయి ప్రేమలో పడి కొన్ని కారణాల వల్ల క్రిమినల్ అవుతాడు. చెప్పాలంటే నటుడిగా నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టే పాత్ర అవుతుంది.

ప్రశ్న) మీ కో స్టార్స్ తో వర్కింగ్ అనుభవం గురించి చెప్పండి.?

స) ఈ సినిమాలో చేసిన అనిల్, దివ్యలు ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’లో చేసారు. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యే ప్రియాంక ఓకే థియేటర్ ఆర్టిస్ట్. తనకి యాక్ట్ చెయ్యడం పెద్ద ఇబ్బంది కాలేదు కానీ ఫస్ట్ టైం కెమెరా ముందు మాత్రం కాస్త తడబడింది. అ ఆతర్వాత సెట్ అయిపొయింది. మరో రోల్ మన్ప్రీత్ సింగ్ కౌర్ చేసింది. తనకి తెలుగు రాకపోవడంతో తన డైలాగ్స్ ని చెప్పాల్సిన టైం కంటే ముందే ఫాస్ట్ ఫాస్ట్ గా చేప్పేసేది. తనుంటే సెట్లో ఫుల్ ఫన్ గా ఉండేది.

ప్రశ్న) ఈ సినిమాతో యువతకి మీరిచ్చే సందేశం ఏమిటి?

స) ఈ సినిమా ద్వారా యువతకి డైరెక్ట్ గా సందేశం ఇవ్వడం లేదు. యువతకి రోల్ మోడల్స్ అయిన వాళ్ళే తప్పు చేస్తే యూత్ ఏమవుతారు. ఉదాహరణకి తండ్రి సిగరెట్ తాగుతూ కనిపిస్తే అతని కొడుకు కూడా సిగరెట్ అలవాటు చేసుకుంటాడు. ఆ తప్పు తండ్రిదే.. ఇలాంటి కంటెంట్ నే మేము ఈ మూవీలో చేస్తున్నాం.

ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?

స) ప్రస్తుతం మారుతి గారి సమర్పణలో కొత్త డైరెక్టర్ తో ఓ సినిమా చేస్తున్నాను. అది త్వరలో మొదలు కానుంది. రిలీజ్ కి 3 సినిమాలు ఉన్నాయి. మరో రెండు సినిమాలు ఎడిటింగ్ లో ఉంటే మరో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

అంతటితో మనోజ్ కి అల్ ది బెస్ట్ చెప్పి మా చిట్ చాట్ ని ముగించాం..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు