ప్రత్యేకం : మొదలైన ‘మేముసైతం’ స్పెషల్ సెట్ వర్క్

ప్రత్యేకం : మొదలైన ‘మేముసైతం’ స్పెషల్ సెట్ వర్క్

Published on Nov 23, 2014 3:03 PM IST

memu-saitham-construction

మునుపెన్నడూ లేని విధంగా నా భూతో న భవిష్యత్ అనేలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కలిసి కంటిన్యూగా 12గంటలు ప్రత్యక్ష ప్రసారం చేస్తూ నిర్వహించనున్న కార్యక్రమం ‘మేము సైతం’. హుదూద్ బాధితుల కోసం చేస్తున్న ఈ ప్రోగ్రాం నవంబర్ 30న హైదరబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది.

ఈ కార్యక్రమం టైం దగ్గర పడుతున్న కొద్దీ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మీకు పలువురు కమెడియన్స్ తమ స్కిట్స్ కి సంబందించిన ప్రాక్టీస్ సెషన్ మొదలు పెట్టారని తెలియజేశాం. నేటి నుంచి ఈ మేముసైతం కోసం డిజైన్ చేసిన స్పెషల్ సెట్ కి సంబంధించిన పనులను కూడా మొదలు పెట్టారు. ఇదివరకే మీకు ఈ మేము సైతం స్టేజ్ ఎలా ఉంటుందా అనే ఫోటోను ప్రత్యేకంగా అందించాం.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందరు హీరోలు, హీరోయిన్స్ కూడా పాల్గొననున్న ఈ కార్యక్రమంలో తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు హీరోలు పాల్గొననున్నారు. నవంబర్ 30వ తేదీన జరిగే మేము సైతం టెలీథాన్ కార్యక్రమాన్ని మీరు జెమిని టీవీలో చూడవచ్చు. టెలీథాన్ ప్రోగ్రాం కోసం వేస్తున్న స్పెషల్ సెట్ ఫైనల్ గా ఎలా ఉంటుంది అనే ఫోటోను కింద మీకందిస్తున్నాం..
memu-saitham

సంబంధిత సమాచారం

తాజా వార్తలు