ప్రత్యేక ఇంటర్వ్యూ : ఆది – ‘గాలిపటం’ చాలా బోల్డ్ గా ఉంటుంది, కానీ వల్గారిటీ ఉండదు.!

ప్రత్యేక ఇంటర్వ్యూ : ఆది – ‘గాలిపటం’ చాలా బోల్డ్ గా ఉంటుంది, కానీ వల్గారిటీ ఉండదు.!

Published on Aug 7, 2014 7:09 PM IST

Adhi

‘ప్రేమ కావాలి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో, సాయి కుమార్ తనయుడు ఆది. ఆ తర్వాత వరుసగా లవ్ ఎంటర్టైనర్స్ చేసిన ఆది కాస్త రూటు మార్చి ఓ కొత్త జోనర్ లో ట్రై చేసిన సినిమా ‘గాలిపటం’. ప్రస్తుతం ఒకే ఫార్మాట్ లో సినిమాలు వస్తున్న తరుణంలో ఆది కాస్త రూటు మార్చి చేసిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదితో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాము. అ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) అసలు ‘గాలిపటం’ సినిమా ఎలా మొదలైంది.?

స) ఈ సినిమాకి ముందు నాకు సంపత్ నందితో పరిచయం లేదు. ఒకరోజు కలిసి కథ చెప్పాడు. నాకు కథ, డైలాగ్స్ బాగా నచ్చాయి. కానీ నేను చేయగలనా అనే అయోమయంలో పడ్డాను. అప్పుడే నాన్నని అడిగాను. నాన్నకి కథ నచ్చింది. ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చేస్తున్నావు కదా ఇలాంటి డిఫరెంట్ సినిమాలు కూడా చెయ్యాలి అన్నాడు. ఆ తర్వాతే ఈ సినిమాకి సైన్ చేసాను.

ప్రశ్న) ‘గాలిపటం’ సినిమా ఎలా ఉంటుంది.?

స) ఇలాంటి జోనర్ సినిమాలు ఇప్పటి వరకూ బాలీవుడ్ లోనే వచ్చాయి, తెలుగులో రావడం ఇదే మొదటిసారి. సినిమా చాలా బోల్డ్ గా ఉంటుంది. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న కాంటెంపరరీ పాయింట్స్ ని ఇందులో చూపించాం. ఇందులో మొత్తం 8 పాత్రలు ఉంటాయి. అన్నిటినీ బాగా డిజైన్ చేసారు అలాగే పర్ఫెక్ట్ ఎండింగ్ కూడా ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ బాగా యూత్ఫుల్ అండ్ ఎనర్జిటిక్ గా ఉంటే సెకండాఫ్ బాగా ఎమోషనల్ గా ఉంటుంది.

ప్రశ్న) చాలా కొత్తగా ట్రై చేసాను అంటున్న ఇందులో మీ పాత్ర గురించి చెప్పండి.?

స) ఇందులో నా పాత్ర పేరు కార్తీక్, అతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే నేను తను ప్రేమించే అమ్మాయి కోసం తన జాబుని వదిలేసి ఏం చేసాడు అన్నదే నా పాత్ర. ఇందులో నా బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా ఉంటుంది.

ప్రశ్న) సినిమా బోల్డ్ గా ఉంటుంది అంటున్నారు, సెన్సార్ వారేమో ‘ఏ’ ఇచ్చారు. దీన్ని బట్టి సినిమాలో అడల్ట్ కామెడీ ఎక్కువ ఉంటుందనుకోవచ్చా.?

స) సినిమా బోల్డ్ గా ఉంటుంది, కానీ సినిమాలో ఎక్కడా వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. అందుకే సెన్సార్ వారు ఒక్క డైలాగ్ కూడా కట్ ఇవ్వలేదు. అందరూ చూసేలా ఈ సినిమా ఉంటుంది. ఒక లిప్ లాక్ సీన్ వల్ల ‘ఏ’ ఇచ్చారు.

ప్రశ్న) ఇలాంటి న్యూ జోనర్ సినిమా కమర్షియల్ గా హిట్ అవుతుందని అనుకుంటున్నారా? బోల్డ్ మూవీస్ కి విమర్శకుల నుంచి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుందని ఆశించలేదా.?

స) ఇది టాలీవుడ్ కి న్యూ జోనర్ అయినప్పటికీ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. డైలాగ్స్, సాంగ్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. అందుకే కమర్షియల్ గా హిట్ అవుతుందని అనుకుంటున్నాం. ఇక విమర్శలు అంటారా.. ఒక కొత్త సినిమాని ట్రై చేస్తున్నాం అంటే మనం విమర్శలకు రెడీగా ఉండాలి. కానీ విమర్శకుల నుండి ఈ సారి పాజిటివ్ వస్తుందని ఆశిస్తున్నాం.

ప్రశ్న) ఈ సినిమాలో కీ రోల్స్ చేసిన రాహుల్ రవీంద్రన్, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా గురించి చెప్పండి.?

స) రాహుల్ రవీంద్రన్ ఒక 5 సీన్స్ లో ఉంటాడు. తన పాత్ర సినిమాకి చాలా కీలకం. ఇక హీరోయిన్స్ గా చేసిన ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవాలు చాలా బాగా చేసారు. వాళ్ళిద్దరికీ ఈ సినిమాతో బ్రేక్ వస్తుందని అనుకుంటున్నాను.

ప్రశ్న) కొత్త డైరెక్టర్ నవీన్ గాంధీ మరియు సంపత్ నంది గురించి చెప్పండి.?

స) ఈ సినిమా పరంగా 50% క్రెడిట్ సంపత్ నందికి ఇస్తాను. తన స్క్రిప్ట్ – డైలాగ్స్ సినిమాకి హైలైట్. నిర్మాతగా పబ్లిసిటీకూడా బాగా చేసాడు. నవీన్ గాంధీ ఫస్ట్ సినిమా యైనా కాన్సెప్ట్ ని చాలా బాగా తీసాడు.

ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?

స) ‘రఫ్’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే నెలలో ఆడియో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం. ఇది కాకుండా మదన్ డైరెక్షన్ లో ఓ సినిమా ఉంది. ఆ సినిమా పక్కా కమర్షియల్ గా ఉంటుంది కానీ ఇన్నర్ గా ఓ మంచి పాయింట్ చెబుతున్నాం. అలాగే ఇక నుంచి ప్రతి సంవత్సరం ‘గాలిపటం’ లాంటి ఓ డిఫరెంట్ సినిమా చెయ్యాలని అనుకుంటున్నాను..

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి ఆది చేసిన ఈ న్యూ జోనర్ మూవీ హిట్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము…

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు