ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : అభిషేక్ నామా – ఓటిటీ కూడా అంతే. ఇక డిమాండ్ ను బట్టే రెమ్యునిరేషన్ !

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : అభిషేక్ నామా – ఓటిటీ కూడా అంతే. ఇక డిమాండ్ ను బట్టే రెమ్యునిరేషన్ !

Published on Jun 1, 2020 1:33 PM IST

మన లాక్ డౌన్ ఇంటర్వ్యూ సిరీస్ లో భాగంగా ప్రముఖ పంపిణీదారుడు మరియు నిర్మాత అభిషేక్ నామాతో మేము మీకు ప్రత్యేక ఇంటర్వ్యూను అందిస్తున్నాము. వివరణాత్మక సంభాషణలతో థియేటర్ వ్యాపారం గురించి, 100 చిత్రాలను పంపిణీ చేయడం గురించి, రాబోయే ప్రాజెక్టులు మరియు మరెన్నో విషయాలు గురించి ఆయన మాట్లాడారు. ఆ విశేషాలు ఏమిటో చూద్దాం

 

ఈ లాక్ డౌన్ లో మీరు ఏమి చేస్తున్నారు?

కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ తో పరిశ్రమలో చాలా మంది బాధపడుతున్నారు, వారికి సహాయం చేయడానికి మేము మా వంతు కృషి చేస్తున్నాము. ఇప్పుడిప్పుడే సడలింపులతో, పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అలాగే థియేటర్లు త్వరగా తెరిచుకోవాలని నేను కోరుకుంటున్నాను.

 

వంద సినిమాలకు పైగా పంపిణీదారుగా ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తూంది?

ఆ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. 35 సంవత్సరాల వయస్సులో వందల సినిమాలు పంపిణీ చేయడం అంటే చాలా పెద్ద విజయమని నేను భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా నేను బెస్ట్ వర్క్ చేయటానికే ప్రయత్నిస్తాను.

 

పంపిణీ చేయడానికి మరియు సినిమా కొనడం వెనుక ఉన్న మొత్తం ప్రక్రియ గురించి ?

ప్రధానంగా, సినిమా రేంజ్ మరియు సినిమాలోని హీరో మార్కెట్ ను బట్టి సినిమా బిజినెస్ ఉంటుంది. ఇక చిన్న చిత్రం అయితే, ఖచ్చితంగా ఆ చిత్రం యొక్క ట్రైలర్ మరియు విజువల్స్ ఆకట్టుకోవాలి. అలాగే ఆ చిత్రం మేకింగ్‌లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ టాక్ కూడా వినిపిస్తోంది. ఈ అంశాలన్నీ సినిమా కొనడానికి ముందు పరిగణించబడతాయి.

 

కరోనా అనంతరం నిర్మాతలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ?

గత కొన్ని రోజులుగా పరిస్థితులు చాలా మారిపోయాయి. ముఖ్యంగా, నిర్మాతలు సిబ్బంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి, రాబోయే రోజులు సవాలుగా ఉంటాయి. కాని మనం కరోనాతో కలిసి జీవించి ముందుకు సాగాలి.

 

కరోనా అనంతరం స్టార్స్ తమ రెమ్యునిరేషన్ తగ్గించడం గురించి ఒక నిర్మాతగా మీరు ఏమి చెబుతారు ?

సినీ పరిశ్రమ అంటేనే డిమాండ్ బట్టే నడుస్తోంది. హీరోకి ఎంత మార్కెట్ ఉందో దానిబట్టే నిర్మాతలు ఇస్తారు. ప్రతిదీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంది. హీరో అయినా హీరోయిన్ అయినా వారికీ ఉన్న డిమాండ్ ను బట్టే వారి రెమ్యునిరేషన్ ఉంటుంది.

 

ఒటిటి ప్లాట్‌ ఫామ్‌లు థియేటర్ వ్యాపారానికి ముప్పుగా ఉన్నాయా?

పైరసీ వచ్చిన కొత్తలో చాలామంది సీడీలలోనే సినిమాలు చూసేవారు. ఆ తరువాత యూట్యూబ్ వచ్చింది, దానిలో చాలా కంటెంట్ ఉంది, ఇక ఎవరు సినిమాలు చూస్తారు అని అన్నారు. కానీ సినీ వ్యాపారం ప్రభావితం కాలేదు. ఓటిటీ కూడా అంతే. ఇది కంటెంట్ కోసం కొత్త వేదిక. అంతేగాని థియేటర్ వ్యాపారాన్ని ప్రభావితం చేయదు.

 

మీరు యంగ్ బ్యాచ్ తోనే ఎక్కువగా పనిచేశారు. మీరు ఎప్పుడు స్టార్స్ లతో పని చేస్తారు?

ప్రతి ఒక్కరూ స్టార్స్ లతో పనిచేయడానికి ఇష్టపడతారు. మేము కూడా ఒక రోజు పని చేస్తాము. హీరో లేదా దర్శకుడిని ఎన్నుకోవడం అంత తేలికైన ప్రక్రియ కాదని చాలామందికి తెలియదు. మేము నిర్మాతలుగా దర్శకులను ఆమోదించినప్పటికీ, హీరోలు దాన్ని ఇష్టపడకపోవచ్చు. దర్శకుల విషయంలో కూడా ఇదే పరిస్థితి. ప్రాజెక్ట్ లాక్ అయిన తర్వాత ప్రాజెక్ట్ను సెట్ చేయడం అంత సులభం కాదు,

 

భవిష్యత్ ప్రాజెక్టులు?

ప్రస్తుతానికి, సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాం. హీరో, స్క్రిప్ట్ మరియు ఇతర వివరాలు రాబోయే రెండు రోజుల్లో లాక్ చేయబడతాయి. ఆ తర్వాత, మేము దానిని అధికారికంగా ప్రకటిస్తాము.

 

వ్యక్తిగతంగా, మీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి?

నాకు కంటెంట్ ఆధారిత సినిమాలు చాలా ఇష్టం. సినిమాల మార్గం విచ్ఛిన్నం కావాలని మరియు రాబోయే రోజుల్లో కొత్త పంథాని ఏర్పాటు చేయాలని నేను భావిస్తున్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీ రోజూ కొత్త ప్రతిభను చూస్తోంది. అంటూ అభిషేక్ నామా ఇంటర్వ్యూను ముగించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు