ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: అమైరా దస్తూర్ – ఎక్కువ దక్షిణాది సినిమాలు చేయడమే నా టార్గెట్ !

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: అమైరా దస్తూర్ – ఎక్కువ దక్షిణాది సినిమాలు చేయడమే నా టార్గెట్ !

Published on Feb 1, 2017 7:33 PM IST


తమిళ చిత్రం ‘అనేగన్’ తెలుగు డబ్బింగ్ ‘అనేకుడు’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి అమైరా దస్తూర్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నటుడు జాకీ చాన్ తో కలిసి ‘కుంగ్ ఫు యోగ’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆమెతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం..

ప్ర) ఈ సినిమా రిలీజ్ పట్ల మీరెలా ఫీలవుతున్నారు ?
జ) చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. ఇప్పటికే చైనాలో రిలీజైన ఈ చిత్రం పలు రికార్డులను బ్రేక్ చేసింది. మరి ఇండియాలో ఎలాంటి ఓపెనింగ్స్ సాధిస్తుందో చూడాలి.

ప్ర) ఈ సినిమా ఛాన్స్ మీకెలా వచ్చింది ?
జ) ముందుగా ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు నాకిది జాకీ చాన్ గారి సినిమా అని తెలీదు. నెల తర్వాత వాళ్ళే ఫోన్ చేసి సినిమాలో సెలెక్టయ్యారు. ఇందులో జాకీ చాన్ హీరో అని చెప్పగానే చాలా థ్రిల్ ఫీలయ్యాను. తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్ దిశా పఠాని కూడా ఇందులో నటిస్తోందని తెలిసి హ్యాపీగా అనిపించింది.

ప్ర) ఇందులో మీ పాత్రేమిటి ?
జ) ఇందులో నాది చాలా కీలకమైన క్యారెక్టర్. సినిమానై మధ్యలో మలుపు తిప్పే పాత్ర. ట్రెజర్ హంట్ నైపథ్యంలో సాగే ఈ సినిమాలోని ఇండియా యువరాణుల్లో నేను కూడా ఒక యువరాణిని.

ప్ర) దిశా పఠానితో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) దిశా సెట్లో చాలా సందడిగా ఉంటుంది. నేను తను చాలా క్లోజ్ ఫ్రెండ్స్, పూరి జగన్నాథ్ గారి పూరి కనెక్ట్స్ ఏజెన్సీతో పని చేసేప్పటి నుండి మేమిద్దరం ఫ్రెండ్స్. నిజానికి పూరిగారే నన్ను తెలుగులోకి పరిచయం చేద్దామనుకున్నారు. కానీ కుంగ్ ఫు యోగ సినిమా వలన ఆ ప్రాజెక్ట్స్ వదులుకున్నాను.

ప్ర) జాకీ చాన్ తో మీ షూటింగ్ అనుభవాలు ?
జ) ఆయనతో పని చేయడం కల నిజమైనట్టు అనిపిస్తోంది. మొదటి రోజు కాస్త భయపడ్డాను. కానీ ఆయన చాలా సరదగా ఉంటారు. ఒకసారి స్టంట్ చేసేప్పుడు నేను గాయపడితే నా కోసం రెండు రోజుల పాటు షూటింగ్ వాయిదా వేశారు. చాలా మంచి వ్యక్తి.

ప్ర) ప్రపంచస్థాయి స్పందన ఎలా అనిపిస్తోంది ?
జ) నా వరకు అన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి. ఇక ప్రపంచస్థాయి స్పందన చాలా సంతోషాన్నిస్తోంది. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను.

ప్ర) సోను సూద్ తో మీ షూటింగ్ అనుభవం ?
జ) మొదట్లో సోను సూద్ చాలా సీరియస్ గా ఉంటారని అనుకున్నాను. కానీ సెట్లో ఆయనతో కాసేపు టైమ్ స్పెండ్ చేయగానే ఆయనెంత సరదాగా ఉంటారో అర్థమైంది. నేను వెజిటేరియన్ అని తెలిసి చైనాలో నా కోసం వెజిటేరియన్ ఫుడ్ తెప్పించేవారు. నాకోసం చాలా కేర్ తీసుకున్నారు.

ప్ర) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) ప్రస్తుతం తమిళంలో కమెడియన్ సంతానంతో కలిసి ఒక సినిమా చేస్తున్నాను. అది షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా విడుదలయ్యాక ఎక్కువ స్క్రిప్ట్స్ వినాలనుకుంటున్నాను.

ప్ర) మీ కెరీర్ ప్లాన్ ఏంటి ?
జ) ప్రస్తుతానికి సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేయాలని ఉంది. ఇక్కడ తీసే ఫ్యామిలీ సినిమాలు చాలా బాగుంటాయి. నాకు ఫ్యామిలీ సెంటిమెంట్స్ అంటే చాలా గౌరవం. అలాంటి సినిమాల్లోనే ఎక్కువగా నటించాలని ఉంది. నా టార్గెట్ కూడా అదే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు