ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ : అంజలి పాటిల్ – ఇలాంటి పాత్రలే మనలోని ప్రతిభను బయటపెడతాయి

ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ : అంజలి పాటిల్ – ఇలాంటి పాత్రలే మనలోని ప్రతిభను బయటపెడతాయి

Published on Nov 19, 2014 9:44 PM IST

Anjali-Patil
జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ‘నా బంగారుతల్లి’ సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్. రియాలిటీకి దగ్గరగా చిత్రీకరించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలకానుంది. ఈ సినిమాలో నటించిన అంజలి పాటిల్ 123తెలుగు కోసం అందించిన ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ మీకోసం..

మీకు ఈ పాత్ర ఎలా దక్కింది?

ఈ సినిమా నిర్మాతలు నన్ను ఫేస్ బుక్ లో చూసి సంప్రదించారు. స్క్రిప్ట్ చదివిన తరువాత సినిమా చేద్దామని నిర్ణయం తీసుకున్నాను

ఈ పాత్ర పోషించడానికి వెనుక బలమైన కారణం ఏమైనా వుందా?

ఈ పాత్రలో వున్న అమాయకపు స్వభావమే కారణం అయ్యి ఉండవచ్చు. పాత్రలో కొలువుదీరిన పలు విభిన్న స్వభావాలు సైతం ఆకర్షించాయి

మీ పాత్రకు పలు ప్రశంసలు, అవార్డులు దక్కాయి. మీరూ ఎలా ఫీల్ అవుతున్నారు?

మనం చేసిన పనిని ఎవరైనా ప్రశంసిస్తే చాలా బాగుంటుంది. భవిష్యత్తులో మనకు అవి ఉపయోగపడతాయి

ఈ పాత్ర పోషిస్తున్నప్పుడు మీరూ ఎదుర్కున్న అతిపెద్ద సవాలు ఏమిటి?

నా పాత్రను చాలామంది తిట్టుకుంటారు, పలురకాల భావాలు తెరపై చూపించడం కాస్త కష్టమయ్యేది

సునీత కృష్ణన్ గురించి కాస్త చెప్పండి.

ఆమె విజన్ కలిగిన మనిషి. సినిమా తీయడానికి ఎంత కష్టపడిందో విడుదలకు సైతం అంతే కష్టాన్ని అనుభవిస్తుంది. ఆమె గుండె ధైర్యానికి జోహార్లు

ఈ చిత్రం క్రౌడ్ ఫండింగ్ నేపధ్యంలో విడుదలకానుందని తెలిసింది. దాని గురించి కాస్త చెప్తారా?

ఒక సినిమాను విడుదల చేయడం కాస్త కష్టమే. మా నిర్మాత చిరంజీవి, అమల వంటి ప్రముఖులను సంప్రదించి వారి సహాయం తీసుకున్నారు. సినిమా చూసాక వారు మాకు విడుదలకు కావలిసిన సహాయం చేస్తున్నారు

దక్షిణాదిన మరిన్ని చిత్రాలు చేస్తారా?
నాకూ భాషతో పట్టింపులు లేవు. దర్శకుడు, నా పాత్ర మాత్రమే ఆలోచిస్తాను

మీ తదుపరి ప్రాజెక్ట్ ల వివరాలు తెలుపండి?
అనీల్ కపూర్ కొడుకు హీరోగా నటిస్తూ, రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా సినిమాలో నటిస్తున్నాను

సంబంధిత సమాచారం

తాజా వార్తలు