ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ : గౌతమి – కుటుంబ భావోద్వేగాలతో కూడుకున్న కథే మనమంతా

ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ : గౌతమి – కుటుంబ భావోద్వేగాలతో కూడుకున్న కథే మనమంతా

Published on Aug 4, 2016 9:47 PM IST

gauthami
ప్రముఖ నటి గౌతమి తెలుగు సినిమాలో కనిపించి దాదాపు రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. ఇంత లాంగ్ గ్యాప్ తరువాత ఆమెను మళ్లీ ‘మనమంతా’ చిత్రంలో చూడబోతున్నాం.కుటుంబ కాథాంశం తో తెరకెక్కిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర విడుదల సందర్భంగా ఆమెతో మేము నిర్వహించిన ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ మీకోసం..

ప్ర) చాలా కాలం తరువాత తెలుగు చిత్రం లో కనిపించబోతున్నారు.ఏదైనా కారణం ఉందా ?
జ) నా వ్యక్తిగత పనుల వల్ల బిజీ గా ఉన్నాను.గత కొంత కాలంగా మంచి కథ కోడం ఎదురుచూస్తున్నాను.’ఐతే’ చిత్రం గురించి గతం లో గొప్పగా విన్నాను.ఆ చిత్ర దర్శకుడే నాకు కథ వినిపించడానికి రావడంతో వెంటనే కథ విన్నాను.

ప్ర) మీరు చంద్రశేఖర్ ఏలేటి గత చిత్రాలేమైనా చూశారా ?
జ) చూడలేదు. అతని చిత్రం లో నటించడానికి అంగీకరించిన తరువాత అతని విజన్ కు అనుగుణంగా పనిచేసి అతని నమ్మకాన్ని నిలబెట్టాలనుకున్నా.

ప్ర) ఈ రోల్ చేస్తున్నపుడు ఛాలెంజింగ్ గా అనిపించిందా ?
జ) ఛాలెంజ్ కన్నా.. చాలా కాలం తరువాత తెలుగు చిత్రంలో నటించడం సంతోషంగా అనిపించింది. మోహన్ లాల్ తో కూడా చాలా గ్యాప్ తరువాత నటించా. ఈ చిత్రం లోని నా పాత్రకు మరోనటి ఊర్వశి తో చాలా సన్నివేశాలు ఉన్నాయి.షూటింగ్ సమయం లో మేం చాలా సరదాగా గడిపాం.

ప్ర) చంద్రశేఖర్ ఏలేటి తో పని చేయడం ఎలా అనిపించింది ?
జ) నేను పనిచేసిన ఉత్తమ దర్శకులలో ఆయన ఒకరు.ఆయన చాలా మక్కువతో చేస్తారు.ఆయన చిత్రం లో కమర్షియల్ హంగుల కోసం పాకులాడారు. షూటింగ్ సమయం లో ఓ సన్నివేశం సరిగా రాలేదు.సమయం కూడా మించిపోతుండడం తో ఆయన ఒత్తిడికి లోనవ్వడం నేను చూశా. ఆయన దగ్గరకు వెళ్లి మీకు నచ్చిన విధం గా తీయమని సలహా ఇచ్చా.

ప్ర) మూడు భాషల్లో ఈ చిత్రం షూటింగ్ జరగడం కష్టంగా అనిపించిందా ?
జ) తెలుగు, తమిళంలో ఈ చిత్రంలో పెద్దగా మార్పులు ఉండవు. కానీ మలయాళం వర్షన్ లో అక్కడి నేటివిటీ కి తగ్గట్లుగా నేను మారవలసి వచ్చింది.

ప్ర) తమిళం మరియు మలయాళం లో ఈ చిత్రానికి స్పందన ఎలా ఉంది ?
జ) ఈ చిత్రాన్ని చూసిన చాలా మంది నా స్నేహితులు, మీడియా మిత్రులు చాలా చాలా గొప్పగా చెబుతున్నారు. అందరు ఈ చిత్రం లోని ఎమోషన్స్ గురించి బాగా చెబుతున్నారు.

ప్ర) ‘మనమంతా’ ని మీ గత చిత్రం దృశ్యం తో పోలుస్తున్నారు.దీనిపై మీరేమంటారు ?
జ) ఈ రెండు చిత్రాలు మధ్య తరగతి కుటుంబ కథలే. ఇది తప్ప మరే అంశంలోనూ ఈ రెండు చిత్రాలకు పోలిక లేదు.

ప్ర) ప్రస్తుతం తెలుగు సినిమా పై మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది ?
జ) ఇక్కడ అందరు వారి ప్రాజెక్ట్ ల కోసం కష్ట పడి పనిచేస్తున్నారు. గతంలో కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలు అద్భుత విజయం సాధించడం నాకు చాలా బాగా నచ్చింది.ఇప్పుడున్న నటులు ఏంతో కష్ట పడి పనిచేస్తున్నారు.

ప్ర) మీ తదుపరి చిత్రాలు ఏమిటి ?
జ) ఓ ఆసక్తి కరమైన ప్రాజెక్ట్ గురించిన సంప్రదింపులు చివరిదశకు చేరుకున్నాయి. అది మరో ద్విభాషా చిత్రంగా రాబోతోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా.

ప్ర) చివరగా.. ‘మనమంతా’ చిత్రం నంచి ఏం ఆశించవచ్చు ?
జ) ఈ చిత్రంలో రియలిస్టిక్ ఎమోషన్స్ ఉన్నాయి. ఈ చిత్రం లోని సస్పెన్స్ థ్రిల్ ను కలిగిస్తుంది.

ఇంటర్వ్యూ ఇంతటితో ముగిసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు