ప్రత్యేక ఇంటర్వ్యూ : హవిష్ – నాకు ఒకే తరహా పాత్రలు చేయడం ఇష్టం ఉండదు.

ప్రత్యేక ఇంటర్వ్యూ : హవిష్ – నాకు ఒకే తరహా పాత్రలు చేయడం ఇష్టం ఉండదు.

Published on Feb 26, 2015 5:01 PM IST

Havish
‘నువ్విలా’, ‘జీనియస్’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న యంగ్ హీరో హవిష్. హవిష్ హీరోగా నటించిన మూడవ సినిమా ‘రామ్ లీల’. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేము హవిష్ తో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించి రామ్ లీల విశేషాలు, తన కెరీర్ ప్లాన్స్ గురించి తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ‘రామ్ లీల’ సినిమా చేయడానికి గల ప్రధాన కారణం ఏమిటి.?

స) రామ్ లీల సినిమా నేను ఓకే చెయ్యడానికి గల కారణం రామ్ అనే క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత స్క్రిప్ట్ కూడా కొత్తగా అనిపించింది.. కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. కచ్చితంగా ఆడుతుంది అనిపించి ఈ సినిమా ఓకే చేసాను.

ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి.? గత సినిమాల కంటే కొత్తగా ఇందులో ఏమన్నా ట్రై చేసారా.?

స) ఈ సినిమాలో నేను చేసిన రామ్ పాత్ర కాస్త ప్లే బాయ్, కాసినోవా టైపు ఉంటుంది. అందరికి ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉండే పాత్ర. ఇప్పటి వరకూ లీలలు అంటే కృష్ణుడు అనే అంటాం, కానీ ఇందులో రామ్ లీలలు చూపించాం. ఈ సినిమాలో పాత్ర ప్రకారం ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తూ, గత సినిమాలకంటే ఎక్కువ డైలాగ్స్ చెబుతాను.

ప్రశ్న) ట్రైలర్ చూసిన చాలా మంది ఇందులో మీ పాత్ర దేవుడని అంటున్నారు. అందులో నిజమెంత.?

స) ట్రైలర్ చూసినప్పటి నుంచి చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు. కానీ ఇందులో దేవుడి పాత్ర అనేది అస్సలు ఉండదు. ట్రైలర్ స్టార్టింగ్ లో దేవుడు వివిధ రూపాల్లో వస్తాడని డైలాగ్ ఇచ్చాం అందువల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. డైరెక్టర్ కన్ఫ్యూజ్ చెయ్యాలనే ట్రైలర్ లో ఆ డైలాగ్ పెట్టారు. కానే ఇందులో దేవుడు అనే పాత్ర లేదు.

ప్రశ్న) మొదటి సారి ఎస్.గోపాల్ రెడ్డి లాంటి సీనియర్ సినిమాటోగ్రాఫర్ తో కలిసి పనిచేసారు.? ఆ అనుభవం గురించి చెప్పండి.?

స) సినిమా కథ ఓకే చేసిన వెంటనే నేను అడిగిన మాట సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎవరన్నా కావాలి ఈ సినిమాకి అని అడిగాను. కిరణ్ కుమార్ గారు గోపాల్ రెడ్డి గారు అనగానే నేను ఫుల్ హ్యాపీ. సినిమా మేము 38 రోజుల్లో షూట్ చెయ్యడానికి ఆయనే కారణం. ఆయన ఇచ్చిన సలహాలు నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ముఖ్యంగా అనుకున్న కాన్సెప్ట్ లో 30% ఆయనే బెటర్ మెంట్ చేసారు.

ప్రశ్న) మీ కో స్టార్స్ అయిన అభిజీత్, నందితల గురించి చెప్పండి.?

స) అభిజీత్, నందితలు నాకు పర్సనల్ గా మంచి ఫ్రెండ్స్.. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు బాగా తెలుసు. దాంతో సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేసాం. ఇద్దరూ ఎంతో టాలెంట్ ఉన్న యాక్టర్స్.

ప్రశ్న) మొదటి సారి దర్శకత్వం వహించిన శ్రీపురం కిరణ్ గురించి మరియు చిన్నా మ్యూజిక్ గురించి చెప్పండి.?

స) శ్రీపురం కిరణ్ కి ఇది మొదటి సినిమా అయినా ఇండస్ట్రీలో దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉంది. అనుకున్నదానిని నిదానంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సినిమాని బాగా తీసాడు. ఇక చిన్నా గారు మ్యూజిక్ చెయ్యరు కానీ డైరెక్టర్ కి బాగా తెలియడం వలన ఈ సినిమాకి మ్యూజిక్ చేసాడు. ఇక ఆయన రీ రికార్డింగ్ ఈ సినిమాకి పెద్ద హైలైట్ అవుతుంది.

ప్రశ్న) అలీ, సప్తగిరి ట్రైలర్ హైలైట్ అవుతుందని అంటున్నారు. మరి దానిపై మీ కామెంట్.?

స) మెయిన్ స్టోరీకి సంబంధం లేకుండా సాగే రెండు కామెడీ ట్రాక్స్ ని అలీ, సప్తగిరిలు చేసారు. అలీగారు పాత్ర పేరు వాకర్, ఈయన కార్స్ కంటే స్పీడ్ గా నడిచేస్తూ ఉంటారు. ఇక ప్రతి సినిమాలో సప్తగిరి దెయ్యాల్ని చూసి భయపడుతూ ఉంటాడు కానీ ఈ సినిమాలో సప్తగిరి దెయ్యాల్ని భయపెడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరి ట్రాక్స్ ఆడియన్స్ ని బాగా నవ్విస్తాయి.

ప్రశ్న) సినిమాల విషయంలో మీ నాన్నగారి సపోర్ట్ ఎంతవరకూ ఉంటుంది.? ఆయన నుంచి ఎలాంటి సలహాలు ఇస్తారు.?

స) నాన్నగారు నాకు మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నారు. స్క్రిప్ట్ విషయంలో కూడా చాలా సలహాలు ఇస్తుంటారు. స్క్రిప్ట్ నేను ఫైనలైజ్ చేసాక ఆయనొకసారి విని ఆయన సలహాలు చెబుతాడు.

ప్రశ్న) జీనియస్ కి రామ్ లీల కి మధ్య చాలా గ్యాప్ తీసుకున్నారు. నెక్స్ట్ కూడా ఇదే గ్యాప్ ని కంటిన్యూ చేస్తారా లేక వెంటనే వేస్రే సినిమాలు ఏమన్నా చేస్తున్నారా.?

స) నాకు ఒకే తరహా పాత్రలు చేయాలి అంటే ఇష్టం ఉండదు. నా గత సినిమాల్లో చేసిన పాత్రలు మళ్ళీ చెయ్యాలని అనుకోను. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త పాత్రలో కనిపించాలని అనుకుంటాను. అందుకే జీనియస్ తర్వాత మంచి కథ కోసం గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా తదుపరి సినిమాకి సైన్ చెయ్యలేదు. చాలా మంది నిర్మాతలు అప్రోచ్ అయినా నాకు నచ్చిన కథ దొరకలేదు. మంచి కథ దొరకగానే నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తాను.

ప్రశ్న) ఒక బిజినెస్ ఫ్యామిలీలో ఉన్న మీకు సినిమాల్లోకి రావాలనే స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది.?

స) నేను అబ్రాడ్ లో నా చదువు పూర్తి చేసుకొని వచ్చిన టైంలో చిన్ని కృష్ణ గారు నాతో సినిమా చేస్తామన్నారు. నాన్న గారు కూడా అవకాశం వచ్చింది ఎందుకు వదులు కోవడం అని ట్రై చెయ్యమన్నారు. అప్పుడే నేను యాక్టింగ్ స్కూల్ లో చేరాను. ఆ టైంలో నాకు సినిమాలపై ఆసక్తి బాగా పెరిగింది. చిన్నికృష్ణ అనుకున్న సినిమా ఆగిపోయినా సినిమాలపై ప్రేరిగిన ఇష్టంతో ఆడిషన్స్ కి వెళ్ళేవాన్ని అలా నువ్విలా సినిమాలో ఆఫర్ వచ్చింది.

ప్రశ్న) చివరిగా రేపు ఈ సినిమా చూడాలనుకునే ఆడియన్స్ కి ఏం చెప్తారు.?

స) ఈ సినిమాలో మేము ఓ కొత్త కథని ట్రై చేసాం, కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో ప్రేక్షకులు కోరుకునే కామెడీ, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. అలాగే మదాలస శర్మ చేసిన ‘భజన భజన’ సాంగ్ కూడా హైలైట్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు