ప్రత్యేక ఇంటర్వ్యూ : కమల్ కామరాజు – అందరినీ ఆలోజింపచేసే సినిమా ‘లేడీస్ & జెంటిల్ మెన్’

ప్రత్యేక ఇంటర్వ్యూ : కమల్ కామరాజు – అందరినీ ఆలోజింపచేసే సినిమా ‘లేడీస్ & జెంటిల్ మెన్’

Published on Jan 29, 2015 8:22 PM IST

kamal-kamaraju
ఛత్రపతి సినిమాతో నటుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమై అవకాయ్ బిర్యాని సినిమాతో సోలో హీరోగా మారిన నటుడు కమల్ కామరాజు. సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించిన కమల్ కామరాజు నటించిన సినిమా ‘లేడీస్ & జెంటిల్ మెన్’. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఆయనతో కాసేపు చిట్ చాట్ చేసాం. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) ‘లేడీస్ & జెంటిల్ మెన్’ ఈ సినిమా ఎలా ఉండబోతుంది.?

స) ఈ మధ్య కాలంలో సోషల్ నెట్వర్క్స్ మీద ఇలాంటి ఓ సినిమా రాలేదు. డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ కి సంబందించిన ఒక 7 మందిని సోషల్ మీడియా అనేది ఎలా ప్రభావితం చేసింది. చెప్పాలంటే కాస్త బోల్డ్ కాన్సెప్ట్ ని ఈ మూవీలో చెబుతున్నాం.

ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి.?

స) ఇందులో నా పాత్ర ఒక భర్త పాత్ర. ఈ పాత్ర విన్నాకే ఈ సినిమా చెయ్యాలని అనిపించింది. ఈ బిజీ సొసైటీలో రోజూ ఆఫీసులో బిజీగా ఉంటూ ఇంటికి వచ్చి బాధ్యతలను నిర్వర్తించడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటూ ఉంటాడు అనేదే నా పాత్ర. రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఈ పాత్రని ఎంచుకున్నాను.

ప్రశ్న) న్యూ డైరెక్టర్ మంజునాథ్ చెప్పిన కథకి ఎంతవరకూ న్యాయం చేసాడు.?

స) మామూలుగా ప్రతి ఒక్కరూ చెప్పినది చెప్పినట్టు చేయలేకపోతారు దానికి కారణం బడ్జెట్ లేదా టైం కారణం కావచ్చు. కానీ ఈ సినిమా విషయంలో మంజు చాలా బాగా ప్లాన్ చేసుకున్నాడు. మంజునాథ్ అనుకున్న కాన్సెప్ట్ ఇంత పర్ఫెక్ట్ గా చెయ్యడంలో కెమెరామెన్ జగన్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె చాలా హెల్ప్ అయ్యారు. అలాగే 7 కథలని చాలా బాగా చెప్పాడు.

ప్రశ్న) మధుర శ్రీధర్ ఇన్వాల్వ్ మెంట్ ఎంత వరకూ ఉంది.?

స) మధుర శ్రీధర్ గ్రేట్ ప్లానర్. అలాగే అంతకంటే మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్. సినిమా పరంగా ఏమి కావాలో అన్ని ఇచ్చాడు, డైరెక్టర్ కి పూర్తి ఫ్రీడం ఇచ్చాడు. అలా పాజిటివ్ నేచర్ ఉన్న పర్సన్ కాబట్టే ఇంతమంది కలిసి ఈ సినిమా చేయగలిగాం.

ప్రశ్న) ఈ సినిమా లో మీరు చెప్తున్న బోల్డ్ పాయింట్ ఆడియన్స్ పై ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది.?

స) ఈ సినిమా చూసే వారిలో నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యదు, చెప్పాలంటే చూసిన వారిని ఆలోజింపజేసేలా ఉంటుంది.

ప్రశ్న) ఈ సినిమా మేజర్ హైలైట్స్ ఏంటి.?

స) ప్రస్తుతం మనుషుల మధ్య దూరం పెరిగిపోయి సోషల్ నెట్వర్క్ లో బతికేస్తున్నారు. దానివల్ల మనుషుల మధ్య పర్సనల్ టచ్ ఉండడం లేదు. అలాంటి వాటికి అలవాటు పడిన అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. చివరి 30 నిమిషాలు ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్.

ప్రశ్న) ఒక సినిమా సైన్ చేసే ముందు కచ్చితంగా ఏమేమి ఉండాలని అనుకుంటారు.?

స) మొదటగా మంచి కథ అయ్యుండాలి. ఆ తర్వాత నిర్మాతకి క్లారిటీ ఉండి, సినిమా పట్ల ఆసక్తిగా ఉండాలి. అలాగే డైరెక్టర్ కి అవగాహన ఉండాలి. నిర్మాత, డైరెక్టర్ వీరిలో ఎవరు సరిగా లేకపోయినా సినిమా మంచిగా రాదు.

ప్రశ్న) హీరోగా సినిమాలు చేసారు, ఒక ఆర్టిస్ట్ గా చేసారు.. మరి ఈ రెండి మధ్య ఉన్న బేధం ఏమిటి?

స) హీరోగా సినిమా చేస్తున్నాం అంటే మొత్తం రెస్పాన్సిబిలిటీ నాపైనే ఉంటుంది. అదే ఒక ఆర్టిస్ట్ గా సినిమా చేస్తున్నాను అంటే అంత ప్రెజర్ నా మీద ఉండదు. అలాగే ఆర్టిస్ట్ గా అయితే ఒకేసారి వేరే సినిమాలు కూడా చెసుకొవచ్చు. ఇక మిగతా హార్డ్ వర్క్ అనేది రెండిటిలోనూ కామన్ గా ఉంటుంది.

ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?

స) ప్రస్తుతం సోలో హీరోగా ఓ సినిమా చేసాను. షూట్ అయిపొయింది , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. అది కాకుండా కొన్ని సినిమాల్లో నెగటివ్ రోల్స్ చేస్తున్నాను.

ప్రశ్న) లేడీస్ & జెంటిల్ మెన్ చూసే వారికి మీరేమి చెప్తారు.?

స) 2014లో ఎన్నో కొత్త తరహా మరియు బోల్డ్ కాన్సెప్ట్ సినిమాలు వచ్చాయి. వాటిని అందరూ ఆదరించారు. అదే తరహాలోనే ఈ ఇయర్ ఇప్పటి జెనరేషన్ కి సంబందించిన బోల్డ్ కాన్సెప్ట్ మూవీ ఇది. ఇందులో కామెడీ లవ్ అన్నీ ఉంటూనే ఒక చిన్న మెసేజ్ కూడా ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు