ప్రత్యేక ఇంటర్వ్యూ : మహాత్ రాఘవేంద్ర – ఫస్ట్ టైం ‘లేడీస్ & జెంటిల్ మెన్’ లో ఓ చాలెంజింగ్ రోల్ చేసాను.!

ప్రత్యేక ఇంటర్వ్యూ : మహాత్ రాఘవేంద్ర – ఫస్ట్ టైం ‘లేడీస్ & జెంటిల్ మెన్’ లో ఓ చాలెంజింగ్ రోల్ చేసాను.!

Published on Jan 28, 2015 8:11 PM IST

Mahat-Raghavendra
స్వతహాగా తమిళ నటుడైనా నటనపై ఉన్నమక్కువతో వచ్చిన అవకాశం కోసం తెలుగు భాషను కూడా ఎంతో చక్కగా నేర్చుకొని ‘బ్యాక్ బెంచ్’ స్టూడెంట్ చేసిన నటుడు మహాత్ రాఘవేంద్ర. మహాత్ రాఘవేంద్ర తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. మహాత్ రాఘవేంద్ర ఒక హీరోగా నటించిన సినిమా ‘లేడీస్ & జెంటిల్ మెన్’. ఈ సినిమా జనవరి 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అడవి శేష్ తో కాసేపు చిట్ చాట్ చేసాము. ఆ విశేషాలు మీ కోసం…

ప్రశ్న) ముందుగా ఈ స్క్రిప్ట్ ఎలా తయారైంది.? మీరెలా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు.?

స) నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమా చేస్తున్న టైంలో మధుర శ్రీధర్ అసిస్టెంట్ మంజునాథ్ ఈ స్టొరీ పాయింట్ ని చెప్పారు. అంటే 2 సంవత్సరాల క్రితమే ఈ కథని నేను విన్నాను. కట్ చేస్తే ఓ రోజు మధుర గారు, మంజునాథ్ ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పారు. నేను ఎవరు హీరోస్ అని అడిగితే కొత్త వాళ్ళని అనుకుంటున్నాం అన్నారు. కొత్త వాళ్ళెందుకు మనీ పక్కనే పెట్టి నేనే చేస్తాను. మిగతా వాళ్ళని కూడా కథ వినమని నచ్చాకే చెయ్యమని అడిగాం అందరూ అలా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు.

ప్రశ్న) ఈ స్క్రిప్ట్ ఓకే చెయ్యడానికి గల కారణం ఏమిటి.? అలాగే మీ పాత్ర గురించి చెప్పండి.?

స) ఈ సినిమా కథలో ప్రస్తుతం డే టు డే లైఫ్ లో జరుగుతున్న పాయింట్ ని చూపించాం. మనిషి జీవితంలో సోషల్ నెట్వర్క్స్(ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రం, వాట్స్ అప్ మొదలైనవి) వలన జరిగే మంచి చెడులను ఈ సినిమాలో చూపించాం. మనీ కోసం అన్వేషించే కుర్రాడి పాత్ర నాది. అలాంటి కుర్రాడు సోషల్ నెట్వర్క్ ని వాడుకొని ఏమేమి చేసాడనేది మీరు తెరపై చూడాలి.

ప్రశ్న) ఈ సినిమాతో రైటర్ గా సంజీవ్ రెడ్డిని, డైరెక్టర్ గా మంజునాథ్ కి అవకాశం ఇచ్చారు. మరి ఇలాంటి కొత్త కాన్సెప్ట్ కి వాళ్ళు ఎంతవరకూ న్యాయం చేసారు.?

స) ఇద్దరూ బాగా హార్డ్ వర్క్ చేస్తారు. మాకు చెప్పిన కాన్సెప్ట్ ని ఎంతో బ్యూటిఫుల్ గా చేసాడు. కమర్షియల్ గా అందరూ నమ్మేలా ఈ సినిమాని చేసాడు. సెట్లోనే ఈ సినిమా చాలా బాగా వచ్చిందని అర్థమైంది.

ప్రశ్న) ఈ సినిమా విషయంలో మధుర శ్రీధర్ గారి ఇన్వాల్వ్ మెంట్ గురించి చెప్పండి.?

స) మధుర శ్రీధర్ గారు నాకు సొంత అన్నతో సమానం. ఆయన ప్రొడక్షన్ లో పనిచేయడం చాలా కంఫర్టబుల్ గాఉంటుంది. మామూలుగా డైరెక్టర్స్ కొంతమంది తమ అసిస్టెంట్స్ కి ఛాన్స్ ఇస్తే సెట్ కొచ్చి ఇదలా అదిలా అని చెబుతూ ఉంటారు కానీ మధురా గారు మాత్రం వాళ్ళకి పూర్తి ఫ్రీడం ఇచ్చి చేయించారు. ప్రతి ఒక్కరినీ ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారు.

ప్రశ్న) మీ ప్రకారం ఈ సినిమా మేజర్ హైలైట్స్ ఏమవుతాయి.?

స) నాతో పాటు ఈ సినిమాలో అడవి శేష్, చైతన్య కృష్ణ, కమల్ కామరాజు, నిఖిత నారాయణ్, స్వాతి దీక్షిత్, లు కూడా నటించారు. వారందరి పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి ఒక హైలైట్ అవుతుంది. వీరికంటే ముందు ఈ సినిమా స్క్రిప్ట్ మరియు డైరెక్షన్ మేజర్ హైలైట్ అవుతుంది.

ప్రశ్న) మధుర శ్రీధర్ గారు ఈ సినిమా బోల్డ్ అండ్ హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్ అన్నారు. మరి ఇది సొసైటీ మీద ఏమైనా నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందంటారా.?

స) ఈ సినిమా ఎలాంటి నెగటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చెయ్యదు. సినిమా చూసే ప్రతి ఒక్కరూ ఒక మంచి మెసేజ్ ఆశిస్తారు. అలా ఈ సినిమా ద్వారా ఓ మంచి మెసేజ్ తెలుసుకుంటారు. అది అందరికీ నచ్చేలా ఉంటుంది.

ప్రశ్న) ఒక సినిమాకి సైన్ చేసేటప్పుడు మీరేమి చూస్తారు.?

స) ఒక నటుడిగా నేను నాకు చాలెంజింగ్ రోల్స్ చెయ్యడం అంటే ఇష్టం. ఇప్పటి వరకూ నేను చేసిన తెలుగు సినిమాల్లో నాకు నటనకి ఆధారం ఉన్న పాత్రలు రాలేదు. కానీ లేడీస్ & జెంటిల్ మెన్ లో చాలెంజింగ్ రోల్ దొరికింది అందుకే చేసాను. ఒకటి నా మనసుకు, నా క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యే పాత్రలు వచ్చినప్పుడు, పాత్ర వినగానే చాలా కొత్తగా ఉందని అనిపిస్తే ఆ సినిమాకి సైన్ చేస్తాను.

ప్రశ్న) ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాల గురించి చెప్పండి.?

స) ప్రస్తుతం తెలుగులో హీరోగా పంచార పచ్చిమిర్చి సినిమా చేస్తున్నాను. దాదాపు 50% షూటింగ్ పూర్తయ్యింది. అది కాకుండా తమిళంలో మూడు సినిమాల్లో హీరోగా చేస్తున్నాను.

ప్రశ్న) చివరిగా ఈ సినిమా చూడాలనుకునే ఆడియన్స్ కి మీరేమి చెబుతారు.?

స) ఈ సినిమాతో మేము ఓ మంచి కాన్సెప్ట్ ని ట్రై చేసాము. అది మీ అందరికీ నచ్చేలా తీసాము. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఓ మంచి ఫీలింగ్ తో బయటకి వస్తారు. ఇలాంటి మంచి చిన్న సినిమాలను చూసి ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం.

అంతటితో మా చిట్ చాట్ ని ముగించి సినిమా మంచి సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు