ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : ‘ఆనందో బ్రహ్మ’ రెగ్యులర్ హర్రర్ సినిమా కాదు – మహి వి రాఘవ్

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : ‘ఆనందో బ్రహ్మ’ రెగ్యులర్ హర్రర్ సినిమా కాదు – మహి వి రాఘవ్

Published on Aug 13, 2017 3:25 PM IST


హీరోయిన్ తాప్సి తాజా తెలుగు చిత్రం ‘ఆనందో బ్రహ్మ’. మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సంబంధర్బంగా ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం..

ప్ర) సినిమా గురించి చెప్పండి ?
జ) ఇది హర్రర్ జానర్ కు సంబందించిన సినిమా. కానీ ఇందులో పాయింట్ కొత్తగా ఉంటుంది. బాగా డిజైన్ చేయబడిన పాత్రలు, స్క్రీన్ ప్లే ఇందులో ఉంటుంది.

ప్ర) రెగ్యులర్ హర్రర్ సినిమాలకి ఈ సినిమాకి తేడా ఏంటి ?
జ) ‘ఆనందో బ్రహ్మ’ లాంటి సినిమా ఇప్పటి వరకు తెలుగులో రాలేదని ఖచ్చితంగా చెప్పగలను. ఇందులో ప్రతి పాత్రకి ఖచ్చితమైన లాజిక్, హర్రర్ తో కలిసిన కామెడీ ఉంటాయి.

ప్ర) టైటిల్ జస్టిఫికేషన్ ఏమైనా ఉంటుందా ?
జ) నిజం చెప్పాలంటే అలాంటిదేమీ ఉండదు. ఈ టైటిల్ అయితే బాగుంటుందని, దీని వలన సినిమాకి పాజిటివ్ వైబ్స్ వస్తాయని పెట్టాం.

ప్ర) తాప్సినే ఎంచుకోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా ?
జ) ‘పింక్’ సినిమాకంటే ముందే ఈ స్క్రిప్ట్ ఆమెకు చెప్పాను. ఆమెకు కూడా నచ్చింది. కానీ కొన్ని కమిట్మెంట్స్ ఉండటం వలన చేయలేకపోయారు. ఆ తర్వాత చేస్తానన్నారు. ఆమె చాలా మంచి నటి. కమిట్మెంట్ ఎక్కువ. ఇందులో కొత్త తాప్సిని చూస్తారు.

ప్ర) సినిమా ఎలా రూపుదిద్దుకుంది ?
జ) బౌండ్ స్క్రిప్ట్ తయారుచేసుకున్నాక నిర్మాతలని కలుస్తూ వచ్చాను. అలా కలవడంలో విజయ్ చిల్లాను కలిసి కథ చెప్పాను. అయన వెంటనే ఒప్పుకోవడంతో సినిమా మొదలైంది.

ప్ర) మీ మొదటి సినిమా ‘పాఠశాల’ కమర్షియల్ గా ఆడలేదు. అక్కడ చేసిన తప్పుల్ని ఇందులో జరగకుండా చూసుకున్నారా ?
జ) అవును. పాఠశాల సరిగా ఆడలేదు. ఆ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాను. అందులో చేసిన తప్పుల్ని ఈ సినిమాలో రిపీట్ చేయకూడదని నిర్ణయించుకున్నాను.

ప్ర) ఈ సినిమా రన్ టైమ్ ఎంతుంటుంది ?
జ) ఈ సినిమా రన్ టైమ్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది. కేవలం 2 గంటలు మాత్రమే.

ప్ర) మీ నిర్మాతల గురించి చెప్పండి ?
జ) నిర్మాతలు విజయ్ చల్లా, శశి దేవిరెడ్డిలకు సినిమాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా విజయ్ అయితే సినిమా మొత్తం నాతోనే ఉండేవారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేవారు కాదు.

ప్ర) ప్రమోషన్లను ఎలా ప్లాన్ చేస్తున్నారు ?
జ) కొంచెం వెరైటీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే సినిమా అందరికీ చేరువయ్యేలా ఉండాలని. అంతేగాక మొదటి నుండి సినిమా రెగ్యులర్ హర్రర్ టైప్ కాదని కూడా చెబుతూ వస్తున్నాం.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి ?
జ) ప్రస్తుతానికైతే ఏం కమిటవ్వలేదు. ఇప్పటికి ఈ సినిమా మీదే పూర్తిగా దృష్టి పెట్టాను. ఇది అయ్యాక తర్వాతి ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు