ప్రత్యేక ఇంటర్వ్యూ : మంచు విష్ణు – ఆడియన్స్ ని థ్రిల్ చేసే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్.

ప్రత్యేక ఇంటర్వ్యూ : మంచు విష్ణు – ఆడియన్స్ ని థ్రిల్ చేసే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్.

Published on Sep 3, 2015 10:12 AM IST

vishnu

పద్మశ్రీ డా. మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమై తండ్రి పేరుని నిలబెట్టేలా, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్న యంగ్ హీరో మంచు విష్ణు. ఇప్పటి వరకూ టాలీవుడ్ లో పెద్దగా పరచయం లేని యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో మంచు విష్ణు చేసిన సినిమా ‘డైనమైట్’. ఇంటెన్స్ మూవీస్ స్పెషలిస్ట్ అయిన దేవ కట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మిస్టర్ కూల్ అయిన మంచు విష్ణుతో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాము ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ‘అరిమ నంభి’ సినిమాని రీమేక్ చెయ్యాలి అనిపించేంతలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పాయింట్ ఏమిటి.?
స) ‘అరిమ నంభి’ సినిమా చూస్తున్నాను, ఇంటర్వెల్ టైంకి నేను థ్రిల్ అయిపోయాను, అసలు ఇలాంటి సినిమా నేనెలా మిస్ అయ్యాను. రిలీజ్ అప్పుడే తెలిసుంటే కొనేసేవాన్ని కదా అని అప్పటికప్పుడు వెంటనే ఫోన్ చేసి రీమేక్ రైట్స్ కోసం అడిగాను. బ్రిలియంట్ స్క్రిప్ట్. రేపు సినిమా చూసాక ఆడియన్స్ కూడా అదే అంటారనే నమ్మకం నాకుంది.

ప్రశ్న) అసలు ‘డైనమైట్’ కథ ఏంటి.. ఎలా ఉండబోతుంది.?
స) ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరం వెళ్తావ్, నమ్మిన సిద్దాంతం కోసం ఏం చేస్తావ్ అన్నదే డైనమైట్ లోని స్ట్రాంగ్ పాయింట్. మగాడిగా లేదా ఒక మనిషిగా ఒక విషయాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే ఎంత దూరం వెళ్ళగలవు అనేదే ఈ సినిమా. పర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్, అందరినీ థ్రిల్ చేసే పాయింట్ తో పాటు సూపర్బ్ యాక్షన్ కూడా ఉంటుంది.

ప్రశ్న) ఈ సినిమాలో మీరు చేసిన పాత్ర గత సినిమాలకంటే ఎంత డిఫరెంట్ గా ఉంటుంది.?
స) ఇప్పటివరకూ నేను టోటల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఉన్న రోల్ చేయలేదు. అలాంటి రోల్ చేయడం నాకు ఇష్టం. అలాంటి పాత్రే ఇందులో చేసాను. అలా అని రెగ్యులర్ స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండవు. రొటీన్ కి డిఫరెంట్ గా అందరినీ థ్రిల్ చేసేలా ఉంటాయి.

ప్రశ్న) డూప్ అనేది లేకుండా మీరే రిస్క్ తీసుకొని యాక్షన్ ఎపిసోడ్స్ చేయడం వెనకున్న కారణం ఏమిటి.?
స) స్వతహాగా నేను యాక్షన్ ఎపిసోడ్స్ ని రియల్ గా చేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను. విజయన్ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్స్ చెప్పగానే ఎలాంటి డూప్ లేకుండా నేనే చేస్తానని అన్నాను, అలా చెయ్యాలంటే ముందు నువ్వు ట్రైన్ అవ్వాలి అని చెప్పారు. అందుకోసమే 2 నెలలు బ్యాంకాక్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని చేసాను.

ప్రశ్న) డైనమైట్ లో ప్రణిత పాత్ర ఎంత కీలకమో చెప్పండి. అలాగే తను చేసిన రిస్కీ స్టంట్స్ గురించి చెప్పండి.?
స) ఈ సినిమా మొత్తం ప్రణిత పాత్ర చుట్టూనే తిరుగుతుంది. తను చాలా బాగా చేసింది. మామూలుగా వేరే హీరోయిన్స్ అయితే ఇలాంటి రిస్క్స్ చేయము అని గోల చేసేవారేమో, కానీ తను మాత్రం చాలెంజ్ గా తీసుకొని చేసింది.

ప్రశ్న) ‘అరిమనంభి’ రీమేక్ అనగానే దేవ కట్టాని డైరెక్టర్ గా అనుకోవడానికి గల కారణం ఏమిటి.?
స) అరిమనంభి అనే సినిమా చాలా స్టైలిష్ గా ఉంటూనే మాస్ పాయింట్స్ కూడా ఉన్న సినిమా. మాస్ అండ్ క్లాస్ అనే రెండు సెన్సిబిలిటీస్ ని పర్ఫెక్ట్ గా చూపించగల దర్శకుడు ఎవరా అని వెతుకుతుంటే దేవకట్టా పర్ఫెక్ట్ అనిపించారు. దేవకట్టా – విజయన్ మాస్టర్ కలిసి సినిమాలో క్లాస్ అండ్ మాస్ సెన్సిబిలిటీస్ ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేసారు.

ప్రశ్న) తనకంటూ ఓ సెపరేట్ స్టైల్ ఉన్న దేవకట్టాలో మీరు నేర్చుకోవాలనుకునే పాయింట్ ఏమన్నా ఉందా.?
స) ప్రతి ఒక్కరి నుంచి ప్రతి రోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. దేవకట్టా నుంచి నేర్చుకుంది అంటే చాలా టాలెంట్ ఉన్న స్క్రీన్ ప్లే రైటర్. డైనమైట్ సెకండాఫ్ లో స్క్రీన్ ప్లేని మార్చేసాడు, ఒరిజినల్ వెర్షన్ చూసిన నాకే ఇంత కొత్తగా ఉందేంది, ఇంత బాగా మార్చారా అనే ఫీలింగ్ వచ్చింది.

ప్రశ్న) ‘విష్ణు టర్న్స్ జాకీ చాన్ ఇన్ డైనమైట్’ అన్నారు.. దాని గురించి కాస్త చెప్పండి.?
స) డైనమైట్ లో జాకీ చాన్ స్టైల్ మరియు ఆయన స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్ ని చూడచ్చు. అందుకే అలా చెప్పాము.

ప్రశ్న) ప్రీ ప్రమోషనల్ టూర్ అనే సరికొత్త ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు. ఇది ఎవరి ఐడియా.?
స) ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ అనేవి హాలీవుడ్, బాలీవుడ్ లో ఉన్నాయి. మన దగ్గర ఎందుకు జరగడం లేదో నాకు తెలియదు. నా సినిమాని అందరికీ రీచ్ చెయ్యాలనుకునే ఈ టూర్ ని ప్లాన్ చేసాం. ఇప్పుడు అందరూ దీని గురించి మాట్లాడు కుంటున్నారు అంటే మా సినిమా అందరికీ రీచ్ అయిపోయిందనే కదా.. ముందు ముందు నా సినిమాలని లోకల్ లోనే కాకుండా యుఎస్ లో కూడా ప్రమోట్ చేస్తాను.

ప్రశ్న) యాక్షన్ థ్రిల్లర్స్ అనేవి టాలీవుడ్ కి కొత్త, మరి అలాంటి సినిమా చేస్తున్నప్పుడు మీకు రిస్క్ అనిపించలేదా.?
స) నాకు రిస్క్ అనిపించలేదు. ఎందుకు అంటే ఇప్పటి తెలుగు ఆడియన్స్ కి మనం ఏమి చూడబోతున్నాం అనేదానిపై క్లారిటీ ఉంది. అందుకే ప్రమోషన్స్ లోనే నా సినిమా ఏంటనేది క్లారిటీగా చెప్పాను. కామెడీ ఎక్కువ ఉండదని చెప్పాము. సో ఆడియన్స్ క్లారిటీగా వచ్చి సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు.

ప్రశ్న) అందరూ హీరోలు కమర్షియల్ సినిమాలను ఎంచుకుంటూ తమ మార్కెట్ ని పెంచుకుంటూ ఉంటే మీరు మాత్రం డిఫరెంట్ జానర్ సినిమాలు చేయడం వెనకున్న కారణం ఏమిటి.?
స) నాకు డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలు చెయ్యడం అంటే ఇష్టం. అలా చేస్తేనే నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను. నాకు ఇంకా చాలా ఏజ్ ఉంది. సో నా పరంగా మార్కెట్ అనేది పెంచుకోవడానికి కెరీర్ ఇంకా ఉంది కదా. కానీ డిఫరెంట్ సినిమాలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెయ్యలేను. నేను స్టార్ అయిపోయాను అంటే ఇంకా బాధ్యత పెరిగిపోతుంది, అప్పుడు అస్సలు డిఫరెంట్ జానర్ సినిమాలు చెయ్యలేను.

ప్రశ్న) నటుడిగా మొదలైన మీ ప్రయాణం ఆ తర్వాత నిర్మాతగా, రైటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా కూడా మారారు. మరి డైరెక్టర్ గా కూడా మారే అవకాశం ఉందా.?
స) ఎన్ని డిపార్ట్ మెంట్స్ లోకి నేను ఎంటర్ అయినా నాకు నటుడిగా ఉండడమే చాలా ఇష్టం, అదే నాకు సంతృప్తిని ఇస్తుంది. ఇక డైరెక్టర్ అంటారా.. ఆ ఛాన్స్ లేదండి. ఎందుకంటే బాగుందని ఏదన్నా పాయింట్ చెప్పచ్చు, అలాగే ఇది అలా చెయ్యచ్చు ఇలా చెయ్యచ్చు అని చెప్పచ్చేమో గానీ డైరెక్షన్ అంటే కష్టం. నాకు తెలిసి ప్రస్తుతానికి ‘ఐ యామ్ నాట్ ఎ గుడ్ స్టొరీ టెల్లర్’.

ప్రశ్న) మీ డ్రీం ప్రాజెక్ట్ ‘రావణ’ ఏమైంది.?
స) ఆ సినిమా స్క్రిప్ట్ అంతా రెడీ అయిపొయింది. దానికి తగగా పర్ఫెక్ట్ నటీనటులు కుదరడం లేదు. అలాగే నా బడ్జెట్ పరిమితి కూడా సరిపోవట్లేదు. ఎందుకంటే నా మార్కెట్ 50 కోట్లు లేదు. అందుకే సరైన టైం కోసం ఎదురు చూస్తున్నాను.

ప్రశ్న) హీరోగా నిర్మాతగా మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?
స) తనికెళ్ళ భరణి గారి డైరెక్షన్ లో ‘భక్త కన్నప్ప’ చేయబోతున్నా. వచ్చే ఏడాది షూట్ మొదలు పెట్టె ఆ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అది స్టార్ట్ అయ్యే లోపు మరో రెండు సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాను. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వివరాలు తెలియజేస్తాను. ఇక నిర్మాతగా కూడా బయట హీరోలతో వచ్చే ఏడాది రెండు, మూడు సినిమాలు చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాను.

ప్రశ్న) ఫైనల్ గా 4వ తేదీన డైనమైట్ సినిమా చూడాలనుకుంటే తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్తారు.?
స) డైనమైట్ అనేది ఫెంటాస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్. మీరు చూస్తున్నంత సేపు చాలా గ్రిప్పింగ్ గా సాగే ఈ కథలో లీనమైపోతారు, అలాగే మీకు బాగా నచ్చుతుంది కూడాను. టాలీవుడ్ కి సరికొత్త జానర్ ఇది. కచ్చితంగా థియేటర్ కి వచ్చే ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడని కచ్చితంగా చెప్పగలను.

అంతటితో మంచు విష్ణు సరికొత్తగా ట్రై చేసిన యాక్షన్ థ్రిల్లర్ ‘డైనమైట్’ మంచి సక్సెస్ అందుకోవాలని విష్ణుకి ఆల్ ది బెస్ట్ చెప్పాము.

రాఘవ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు