ఎక్స్ క్లూజివ్ : రామ్ గోపాల్ వర్మ – శ్రీదేవి బయోపిక్ చేసే సామర్థ్యం గల నటి ఎవరూ లేరు !

ఎక్స్ క్లూజివ్ : రామ్ గోపాల్ వర్మ – శ్రీదేవి బయోపిక్ చేసే సామర్థ్యం గల నటి ఎవరూ లేరు !

Published on May 14, 2018 3:25 PM IST

తరుచు వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈసారి క్యాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఆ విషయంలోకి పవన్ కళ్యాణ్ ని కూడా లాగి వార్తల్లో నిలిచిన అయన త్వరలో నాగార్జునతో కలిసి చేసిన ‘ఆఫీసర్’తో మన ముందుకురానున్నారు. ఈ సందర్బంగా ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం..

పవన్, శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత అందరి చూపు మీ మీదే ఉంది. దీన్ని ఎలా డీల్ చేస్తారు ?

ఇది నేను ఎంచుకున్న జీవితం. నేను మాట్లాడే ప్రతి దానికి, చేసే ప్రతి పనికి నాదే భాద్యత. నేను చేసే వాటికి ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నిటినీ పూర్తి సామర్థ్యంతో చేస్తాను.

పవన్ కళ్యాణ్ – శ్రీరెడ్డి విషయంలో చాలా మంది ప్రేక్షకులు మీకు వ్యతిరేకంగా ఉన్నారు. దీన్ని ఎలా తీసుకుంటారు ?
ఇది తాత్కాలికం మాత్రమే. ఏదైనా ఒక విషయం పవన్ కళ్యాణ్ లేదా నాలాంటి వాళ్ళ పేర్లు ఉంటేనే జనాల్లోకి తొందరగా వెళుతుందని ఆలా చేశాను. అయినా ప్రజలు చాలా తెలివివైనవారు. వాళ్లకు ఏం కావాలో అదే తీసుకుంటారు. వారికి ఎన్నో ముఖ్యమైన పనులు చాలా ఉంటాయి.కొన్ని రోజుల తరవాత అందరూ మర్చిపోతారు.

మీకు వ్యతేరేకంగా సోషల్ మీడియాలో రాసే వార్తలను మీరు చదువుతారా ?
లేదు. నాకు అంత సమయం లేదు నాకు ఎక్సయిట్మెంట్ కలిగించే వార్తలను మరియు మా టీమ్ ద్వారా వచ్చే వార్తలను మాత్రమే చదువుతాను.నేను నా సినిమాల్లో చాలా బిజీగా ఉంటాను.

మీరు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పారు మళ్ళీ ఎందుకు ట్విట్టర్ లో అయన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ?
అవును ఆయనకు క్షమాపణలు చెప్పాను. కొన్ని సంఘటనలపైనా ఆయనకు వ్యతిరేకంగా నేను నా సందేశాన్ని పోస్ట్ చేస్తూ ఉంటా. అనేక విషయాల మీద నా అభిప్రాయాల్ని పోస్ట్ చేస్తాను.

పవన్ కాంట్రవర్సీపై నాగార్జునా గారి రియాక్షన్ ఏంటి ?
నాగార్జున గారు నాకు చాలా కాలంగా తెలుసు. అయన అసలు పవన్ విషయాన్నినా దగ్గర ఎప్పుడు ప్రస్తావించలేదు.నాగ్ ఒక నటుడిగా తన ఏకాగ్రతని సినిమాపై మాత్రమే పెడతారు.

మీరు అఖిల్ తో చేయబోయే ప్రాజెక్ట్ ని నాగార్జున గారు ఆపేసారు అని విన్నాము మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో?
ఆయన చెప్పారా ప్రాజెక్ట్ అగిపోయిందని. నేను ప్రకటించిన ఆ ప్రాజెక్ట్ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇవ్వన్నీ మీడియా సృష్టించిన రూమర్స్. త్వరలోనే ఈ ప్రాజెక్టుని స్టార్ట్ చేయబోతున్నాం.

మీ ‘ఆఫీసర్’ గురించి చెప్పండి మూవీ ఎలా వచ్చింది?
చాలా బాగా వచ్చింది . ఇది హైదరాబాద్ కు చెందిన పోలీస్ ఆఫీసర్ ఒక కేసు విషయంలో ముంబై వెళ్లి ఒక పోలీస్ గురించి ఇన్వెస్టిగేషన్ చేసే కథ. ఈ సినిమాని చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించాం . ఈ సినిమాలో నాగార్జున గారు మేకప్ వేసుకోకండా నటించారు. అలాగే నాగ్ ఈ సినిమాలో కొన్ని రియల్ ఫైట్స్ చేశారు.

జిఎస్టి సినిమా విషయంలో మీకు వ్యతిరేకంగా దాఖలైన కేసు ఫై లేటెస్ట్ అప్డేట్ ఏంటి ?
ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది . దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు ఈ కేసు నుండి నేను క్లీన్ గా బయటకు వస్తాను ఇప్పటివరకు చట్టం తన పనిని తాను చేసుకుంటూ వెళుతోంది.

మీ హాలీవుడ్ ప్రాజెక్ట్ ఎక్కడిదాకా వచ్చింది ?
ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. ఒక 8 లేదా 9 నెలలు సమయం పట్టవచ్చు . ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. దానికోసం చాలా ప్లానింగ్ కావాలి .

బాలీవుడ్ సినిమాల గురించి ?
త్వరలోనే ‘ఆఫీసర్’ సినిమాని నాగ్ తో హిందీలో రీమేక్ చేస్తాను. దీని తర్వాత నేరుగా హిందీలో మరో సినిమా ఉంటుంది. ఆ వివరాలను తొందర్లోనే ప్రకటిస్తాను.

శ్రీదేవి గారి మరణం మీ ఫై ఏవిధమైన ప్రభావం చూపించింది ?
నేను జీర్ణించుకోలేకపోయాను శ్రీదేవిగారు లేరు అనే వార్తను. ప్రపంచమంతా తెలుసుకోవాలనుకుంటుంది శ్రీదేవి గారు ఎలా చనిపోయారో. ఆమె మరణం విషయంలో ఏవైనా లొసుగులు ఉన్నాయా అనేది కూడ తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఆమె మనతో లేదు అనే విషయం నన్ను చాలా బాధకు గురిచేస్తోంది. కాలమే అన్ని గాయాల్ని నయం చేస్తుంది.

శ్రీదేవి గారి బయోపిక్ తెరకెక్కించే ఆలోచన ఏమైనా ఉందా ?
నాకు అటువంటి ప్లాన్స్ లేవు . శ్రీదేవి గారి బయోపిక్ ఎవరు తెరకెక్కించాలి అనుకున్నా ఆమెలా నటించగల నటిని తీసుకురాలేరు. ఒకవేళ ఎవరైనా బయోపిక్ చేద్దామని ముందుకు వచ్చిన బోనీ కపూర్ దాన్ని సరిగా తెరకెక్కనివ్వరు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు