ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : సుధీర్ వర్మ – నటనతో నిఖిల్ అందరినీ ఆశ్చర్యపరుస్తాడు !

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : సుధీర్ వర్మ – నటనతో నిఖిల్ అందరినీ ఆశ్చర్యపరుస్తాడు !

Published on May 17, 2017 3:57 PM IST


సినిమా కథనాన్ని ఆకట్టుకునే విధంగా థ్రిల్లింగా చెప్పడంలో దర్శకుడు సుధీర్ వర్మ సిద్ధహస్తుడు. ఆయన రూపొందించిన ‘ స్వామిరారా’ చిత్రం చూస్తే ఈ సంగతి ఇట్టే అర్థమవుతుంది. ప్రస్తుతం ఆయన నిఖిల్ హీరోగా ‘కేశవ’ అనే చిత్రాన్ని చేశారు. ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆయన సినిమా గురించిన పలు విశేషాల్ని మాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ‘దోచెయ్’ తర్వాత అంత లాంగ్ గ్యాప్ ఎందుకు తీసుకున్నారు ?
జ) ముందుగా రవితేజ గారితో సినిమా చేద్దామనుకున్నాను. కానీ అది కుదరలేదు. అందుకే ‘కేశవ’ స్టోరీ రాసుకుని నిఖిల్ తో చేశాను.

ప్ర) మీరు ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్స్ నే ఇష్టపడతారెందుకు ?
జ) నాకు ఆ జానర్ అంటే ఇష్టం. అదే నా బలం కూడా. ఎవరికి ఏది బలమో అందులోనే సినిమాలు చేయాలని నేనుకుంటాను. అందుకే నా నుండి బొమ్మరిల్లు లాంటి ఫ్యామిలీ డ్రామా ఉన్న సినిమాలు రావు. నాకు సినిమాలో ఫన్ కన్నా బేసిక్ ఎమోషన్ అనేది ఇష్టం.

ప్ర) ‘కేశవ’ సినిమా దేని గురించి ?
జ) ఇది మంచి ఎమోషన్స్ తో కూడిన రివెంజ్ డ్రామా. ఇందులో బేసిక్ పాయింట్ నిఖిల్ రివేంజ్ తీర్చుకోవడమే. కానీ ఆ రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అనేదే సినిమాలో హైలెట్.

ప్ర) ‘కేశవ’ కథ నిఖిల్ కోసమే రాసుకున్నారా ?
జ) అవును. దోచెయ్ తర్వాత నిఖిల్ తో సినిమా చేయాలని అనుకున్నప్పుడే ఈ కత రాసుకున్నాను. ఇందులోని ప్రతి సన్నివేశం నిఖిల్ ను దృష్టిలో పెట్టుకుని రాసిందే.

ప్ర) నిఖిల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న తన పాత్రకు ఎంతవరకు న్యాయం చేశాడు ?
జ) నిఖిల్ తన నటనతో అందరినీ ఆశ్చర్యపరుస్తాడని గట్టిగా నమ్ముతున్నాను. పాత్రలోని ఎమోషన్స్ ను అతను పలికించిన తీరు చాలా బాగుంటుంది. సుకుమార్ గారికి కొన్ని సన్నివేశాలు చూపించాక ఈ మధ్య కాలంలో ఇంతలా ఎమోషన్స్ ను పలికించిన నటుడ్ని చూడలేదని ఆయన అన్నారు. సుకుమార్ లాంటి దర్శకుడు అలా అందమే నిఖిల్ పెర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఉందో చెబుతుంది.

ప్ర) నిఖిల్ పాత్రకు హార్ట్ డిసీజ్ ఎందుకు పెట్టారు ?
జ) నా కథలోని హీరో పగ తేర్చుకోవాలనే తపనతో అన్ని ఎమోషన్స్ ని లోపల దాచిపెట్టుకుని ఉంటాడు. అలాంటి వ్యక్తికి ఒక ఆరోగ్య సమస్య ఉంటే బాగుంటుంది అనుకున్నాను. అలాంటి అంశాలు చాల ఆసక్తికరంగా ఉంటాయి.

ప్ర) సినిమా రిలీజ్ కు ముందే చాలా హైప్ క్రియేట్ చేసింది. ఆ అంచనాల్ని సినిమా అందుకుంటుందా ?
జ) ఖచ్చితంగా సినిమా అందరినీ 100 శాతం ఎంటర్టైన్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ చిత్రం ‘స్వామి రారా’ కన్నా చాలా బాగా వచ్చింది. చాలా బలమైన ఎమోషన్స్ ఉన్న ఈ చిత్రంలో మధ్యలో డిస్టర్బ్ చేసే అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివేమీ ఉండవు.

ప్ర) సినిమా రన్ టైమ్ కూడా తక్కువే దాని వెనుక కారణం ?
జ) సినిమా ఒక సీరియస్ రివెంజ్ డ్రామా. మధ్యలో డిస్ట్రబెన్స్ లాంటివి ఏవీ ఉండకూడదు. ఈ సినిమా కోసం థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు నిఖిల్ నుండి కొత్తదనం ఆశించే వస్తారు. ఆంతేగాని నిఖిల్ డ్యాన్సులు, ఫైట్స్ చూడటానికి రారు. అందుకే అవేమీ లేకుండా రన్ టైమ్ తగ్గించాను.

ప్ర) సినిమా ఎలా వచ్చింది ?
జ) అనుకున్నదానికంటే సినిమా చాలా బాగా వచ్చింది. సెన్సార్ జరిగేప్పుడు ఇద్దరు లేడీ ఆఫీసర్స్ నా దగ్గరకొచ్చి సినిమా చాలా బాగుందని, నా వర్క్ ను మెచ్చుకున్నారు. దాన్నిబట్టి సినిమాలోని ఏమోషన్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని అర్థమైంది.

ప్ర) మీ సినిమాలకు మీరెలా వర్క్ చేస్తారు ?
జ) నా దగ్గర మొత్తం బౌండ్ స్క్రిప్ట్ ఉందంటేనే సినిమా మొదలుపెడతాను. ఒకేసారి సెట్లోకి వెళితేనా మైండ్లో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. పేపర్ మీద ఏముంటుందో అదే స్క్రీన్ మీద కనిపిస్తుంది. పూర్తి క్లారిటీతోనే సినిమా చేస్తాను.

ప్ర) మీ సినిమాలన్నీ కథతో నడిచేవే. మరి స్టార్ హీరోలతో పనిచేయగలనని అనుకుంటున్నారా ?

జ) ఎందుకు చేయలేను ! నేను పరిస్థితులకు తగ్గట్టు మారగలిగేవాడ్ని. స్టార్ హీరో ప్రాజెక్టుకు చాలా వెయిట్ తీసుకొస్తాడు. దానికి తగ్గట్టు నేను సినిమా చేయాలి. స్టార్ హీరోల కోసమే కొన్ని సబ్జెక్ట్స్ రాసుకున్నాను. అన్నీ కుదిరి, డైరెక్టర్ గా మంచి పేరొస్తే అవి వర్కవుట్ అవుతాయి.

ప్ర) కెమెరా వరకు చాలా బాగుంది. దాని గురించి చెప్పండి ?
జ) దివాకర్ మని అనేకోత్త టెక్నీషియన్ ఈ సినిమాకి పని చేశాడు. ఈ సినిమా తర్వాత అతను మంచి స్థాయికి వెళతాడు. కెమెరా వర్క్ చాలా బాగా చేశాడు. కొన్ని షాట్స్ అయితే ఇప్పటి వరకు తెలుగు సినిమాలో చూద్దని విధంగా ఉంటాయి.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) నెక్స్ట్ సినిమా శర్వానంద్ తో చేయాలనుకుంటున్నాను. అది జూలై లేదా ఆగష్టు లో మొదలవుతుంది. అదొక యాక్షన్ థ్రిల్లర్. అందులో శర్వానంద్ చాలా కొత్తగా కనిపిస్తాడు. రవితేజ కోసం కూడా ఒక కథ రెడీ చేశాను. దాన్ని అయన తప్ప మరొకరు చేయలేరు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు పూర్తయితే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. అది గ్యాంగ్ స్టర్ నైపథ్యంలో సాగే చిత్రం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు