ప్రత్యేక ఇంటర్వ్యూ : మంచు విష్ణు – సూపర్ స్టార్ మూవీ టాలీవుడ్ యాక్షన్ సినిమాలని రీడిఫైన్ చేసేలా ఉంటుంది.!

ప్రత్యేక ఇంటర్వ్యూ : మంచు విష్ణు – సూపర్ స్టార్ మూవీ టాలీవుడ్ యాక్షన్ సినిమాలని రీడిఫైన్ చేసేలా ఉంటుంది.!

Published on Sep 9, 2014 5:24 PM IST

Manchu-Vishnu
పద్మశ్రీ దా. మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హీరో మంచు విష్ణు. మంచు విష్ణు హీరోగానే కాకుండా ఒక నిర్మాతగా కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకూ సొంత బ్యానర్ తామే హీరోలుగా చేసిన విష్ణు ఇకపై బయట హీరోలతో కూడా సినిమాలు చేసి నిర్మాతగా కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. విష్ణు నటించిన ‘అనుక్షణం’ కూడా సెప్టెంబర్ 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంచు విష్ణుతో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాము ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) అసలు అనుక్షణం సినిమా ఎలా మొదలైంది.?

స) రౌడీ టైంలో నేను ఓ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూసి బాగుంది, దాన్ని నిర్మాతగా చెయ్యాలని వర్మ గారికి చూపించాను. ఆయన చూసి ఈ సినిమా కాదు కానీ ఇలాంటి జోనర్ లో నా దగ్గర ఓ సినిమా ఉంది కథ చెబుతా విను అని ఒక 15 -20 నిమిషాలు చెప్పారు. ఆ టైంలో నేను కథ వింటూ బాగా టెన్షన్ అయ్యాను. అప్పుడే ఇదే ఫేస్ లో ఇంత టెన్షన్ క్రియేట్ చెయ్యగలిగితే సినిమా అదిరిపోద్ది అని చెప్పాను. దాన్నే డెవలప్ చేసి ఈ సినిమా తీసాం.

ప్రశ్న) ఈ మధ్య హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా బాగా బిజీ అయినట్టున్నారు.?

స) అవునండి. ఇక నుంచి హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా నా బ్రాండ్ వెయ్యాలనే ఉద్దేశంతో వేరే బయట హీరోలతో కూడా సినిమాలు చెయ్యాలనుకుంటున్నాను. అందుకే ఇక నుంచి మా బ్యానర్ లో మేము చేసే సినిమాలు తగ్గించి వేరే హీరోలతో సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నాను.

ప్రశ్న) ఓ సూపర్ స్టార్ తో చేస్తామని చెప్పారు.. ఆ సినిమా గురించి కాస్త చెబుతారా.?

స) అవునండి.. ఆ సినిమాలో నటించబోయే సూపర్ స్టార్ తో కలిసి వచ్చే వారం ప్రెస్ మీట్ పెట్టి మీడియా వారికి సూపర్ స్టార్ ని పరిచయం చేసి, ఆ మూవీ డీటైల్స్ అనౌన్స్ చేయబోతున్నాం. ఆ సూపర్ స్టార్ ఎవరు అన్నది చెప్పలేము కానీ తను మాత్రం టాలీవుడ్ కి చెందిన హీరోనే.. ఈ సినిమా హాలీవుడ్ స్టైల్లో ఉండే పవర్ ప్యాక్ యాక్షన్ ఎంటర్టైనర్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ యాక్షన్ సినిమాలని రీడిఫైన్ చేసేలా ఉంటుంది.

ప్రశ్న) నాన్నగారి కోరికైన ‘డాక్యుమెంటరీ ఫిల్మ్’ ఎంతవరకూ వచ్చింది.? ఆ విశేషాలు చెప్పండి.?

స) నాకు ఇలా డాక్యుమెంటరీ ఫిల్మ్ చెయ్యాలి అని వచ్చిన ఐడియాని నాన్నకి చెప్పినప్పుడు, అది చెయ్యడం నా లక్ష్యం రా నువ్వు చేసివ్వు అని ఎంకరేజ్ చేసారు. డాక్యుమెంటరీ అనేది ఖర్చుతో కూడుకున్నది, అలాగే ఈ డాక్యుమెంటరీ వల్ల నాకు వచ్చే లాభం జీరో, అన్నింటిలో ఎంత వస్తుంది అని లెక్కలేసుకొని చేయకూడదనే నా భావన, అందుకే ఇది చేస్తున్నాను. గత సంవత్సరం నవంబర్ లో రీసర్చ్ మొదలు పెట్టాం. స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఈ నెలాఖరున సెట్స్ పైకి వెళ్ళిపోతుంది. త్వరలోనే ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ పై ఒక ప్రోమో రిలీజ్ చేయనున్నాం. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ లో ప్రతి 10 సంవత్సరాల్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దశాదిశని మార్చిన వారిని గురించి చెప్పనున్నాం. ఉదాహరణకి ఇండియన్ ఫస్ట్ ఫిల్మ్ నిర్మాత ఓ తెలుగువాడు, విఠలాచార్య, చిత్తూరు నాగయ్య మొదలైన వారి ప్రాముఖ్యత గురించి ఇందులో చెప్పనున్నాం.

ప్రశ్న) మొదటి సారి మీ బ్యానర్ లో మనోజ్ తో చేస్తున్న ‘కరెంట్ తీగ’ సినిమా ఎలా వచ్చింది.? ఆ సినిమా రిలీజ్ విశేషాలు ఏమిటి.?

స) కరెంట్ తీగ రసెష్ చూసాను సినిమా చాలా బాగా వచ్చింది. మనోజ్ కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా ఈ సినిమా నిలుస్తుంది. ఇది తమిళ మూవీ ‘వర్తపడు వాలిబార్ సంఘం’కి రీమేక్ కానీ మనోజ్ ఇమేజ్ కి తగ్గట్టు కథలో చాలా మార్పులు చేసాం. మనోజ్ గత సినిమాలలానే ఆడియో కూడా సూపర్ హిట్ అవుతుంది. అక్టోబర్ 2న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం.

ప్రశ్న) రామ్ గోపాల్ వర్మ – మోహన్ బాబు కాంబినేషన్ లో రానున్న సినిమాని కూడా మీరే నిర్మించనున్నారా.?

స) ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. కథ ఫైనలైజ్ కాగానే సెట్స్ పైకి వెళ్తుంది. ఆ సినిమా కూడా నా బ్యానర్ లోనే ఉంటుంది.

ప్రశ్న) తమిళ్ మూవీ ‘అరిమ నంబి’ రీమేక్ రైట్స్ తీసుకొని, ఆ సినిమాలో మీరు నటిస్తున్నారని విన్నాం. దానిపై మీ కామెంట్.?

స) అవును. తమిళ సినిమా ‘అరిమనంబి’ బాగుందని ఒకే రోజు ముగ్గురు చెప్పారు. నిర్మాత ఎవరా అని కనుక్కుంటే ఆ మూవీ ప్రొడ్యూసర్ తను నాన్నగారికి బాగా తెలిసిన వ్యక్తి. మేము ఇలా అనగానే ఆయన వచ్చి రైట్స్ తీసుకెళ్ళిపోండి అని అన్నారు. వెళ్లి చూసి అడిగాక మొదట 3 కోట్లు చెప్పారు అంత ఐతే కుదరదని చెప్పి వచ్చేసాం. మేము వచ్చేసాక ఆయన రీమేక్ రైట్స్ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసేసి రీమేక్ రైట్స్ రేటు 24 ఫ్రేమ్స్ వాళ్ళే డిసైడ్ చేస్తారని చెప్పి బాండ్ రెడీ చేసి పంపేసారు. ఎర్రబస్సు అయ్యాక ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. డైరెక్టర్, నటీనటుల వివరాలు త్వరలోనే చెబుతాం.

ప్రశ్న) ‘అనుక్షణం’ సినిమాని 12 నుండి 13కి వాయిదా వేయడానికి గల కారణం ఏమిటి.?

స) ముందుగా ఈ సినిమాని ఆగష్టు లో రిలీజ్ చెయ్యాలి. కానీ కొన్ని కొన్ని చిన్న కరెక్షన్స్ కోసం రీ షూట్ చేసాం.. ముందు 12న రిలీజ్ అనుకున్నాం, కానీ మేము 13న రిలీజ్ చేస్తే మాకు మరో 150 థియేటర్స్ పెరుగుతున్నాయి. అందుకే ఒకరోజు వెనక్కి తీసుకెళ్ళాము.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి మంచు విష్ణు నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు