భారీ అంచనాలనడుమ కత్తి తెలుగు వెర్షన్

భారీ అంచనాలనడుమ కత్తి తెలుగు వెర్షన్

Published on Oct 22, 2014 11:00 PM IST

Kaththi
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విజయ్ నటించిన ‘కత్తి’ సినిమా తమిళ వెర్షన్ విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులనుండి మంచి స్పందననూ అందుకుంటుంది. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో వేరియేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘తుపాకీ’ సినిమా మంచి విజయం సాధించడంతో విజయ్ కు తెలుగులో సైతం మంచి మార్కెట్ ఏర్పడింది

ఈ సినిమాపై తెలుగులో ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచారం సరిగ్గా సాగితే మంచి విజయం సాధించే అవకాశం పుష్కలంగా వుంది. ఈ చిత్రానికి మురగదాస్ దర్శకుడు. సమంతా విజయ్ సరసన నటించింది. టాగూర్ మధు ఈ తెలుగు వెర్షన్ ని విడుదలచేయనున్నారు. ‘కత్తి’ తెలుగు వెర్షన్ ఈ నెల 31న విడుదలకానుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు