ప్రముఖ కెమెరామెన్ దర్శకత్వంలో యువ హీరో !

ప్రముఖ కెమెరామెన్ దర్శకత్వంలో యువ హీరో !

Published on Oct 20, 2017 4:58 PM IST


‘పిల్ల జ‌మిందార్‌’, ‘సుప్రీమ్‌’, ‘గీతాంజలి’, ‘ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడా’ లాంటి సూప‌ర్‌ డూప‌ర్ చిత్రాల‌కి అద్బుత‌మైన సినిమాటోగ్ర‌ఫి అందించిన సాయి శ్రీరామ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ‘అందాల రాక్ష‌సి’, ‘అర్జున్ రెడ్డి’ లాంటి చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన రదన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాగ శౌర్య ఈ చిత్రంలో హీరో.

మ‌న్యం ప్రోడ‌క్ష‌న్ బ్యాన‌ర్ లో మ‌న్యం విజ‌య్ కుమార్ నిర్మాత‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. కాలేజి బ్యాక్‌డ్రాప్ లో ల‌వ్ ఎంట‌ర్‌టైనర్ గా ఈ చిత్ర కథాంశం ఉండబోతుందని తెలుస్తోంది. గతంలో కెమెరామెన్ గా పని చేసిన చాలామంది ఇప్పుడు దర్శకులుగా సక్సెస్ ఫుల్ సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే, ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు