కాలా ప్రసార హక్కులు దక్కించుకున్న ప్రముఖ ఛానల్

కాలా ప్రసార హక్కులు దక్కించుకున్న ప్రముఖ ఛానల్

Published on Apr 25, 2018 6:25 PM IST

సూపర్ స్టార్ రజిని కాంత్ సినిమా వస్తుందంటేనే పెద్ద పండుగ వస్తున్నట్లుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా తమిళనాడులో ఆయన చిత్రాలకు వచ్చే ఓపెనింగ్స్ చూస్తే ఎంతటివారికైనా ఆశ్చర్యం వేయకమానదు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా, కంటెంట్ బాగుంటే చాలు ఆయన చిత్రాలు అద్భుత కలెక్షన్లు కొల్లగొడుతుంటాయి. అయితే ఆయన ప్రస్తుతం నటిస్తున్న నూతన చిత్రం కాలా. అఆయన గత చిత్రం కబాలి కి దర్శకత్వం వహించిన పా రంజిత్ ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు.

ఇటీవల విడుదలయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా ఎవరూ ఊహించని భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు సమాచారం. అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమా ప్రసార హక్కులను విజయ్ టివి ఛానల్ అత్యధిక ధరకు దక్కించుకుందట. రజినికాంత్ సరసన హ్యూమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని రజిని అల్లుడు ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థ పై నిర్మిస్తున్నారు…

సంబంధిత సమాచారం

తాజా వార్తలు