ఉత్కంఠతో ఎదురుచూస్తున్న తారక్ అభిమానులు !

ఉత్కంఠతో ఎదురుచూస్తున్న తారక్ అభిమానులు !

Published on May 19, 2018 11:12 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ఈరోజు సాయంత్రం 4 గంటల 50 నిముషాలకు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేస్తున్న త్రివిక్రమ్ ఆయన్ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేగాక రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా కావడంతో ఎలాంటి టైటిల్ పెడతారో చూడాలనే ఉత్కంఠతో ఉన్నారు.

సినీ వర్గాల్లో మాత్రం సినిమా టైటిల్ ‘అరవింద సమేత రాఘవ’ అని కొందరు ‘అరవింద సమేత సిద్దార్థ’ అని ఇంకొందరు అంటున్నారు. మరి త్రివిక్రమ్ వీటిలోనే ఒకదాన్ని ఎంచుకుంటారో లేకపోతే వేరే కొత్త టైటిల్ నిర్ణయిస్తారో చూడాలి. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. అక్టోబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు