డార్లింగ్.. ఆ రెండూ చేసేసి పెళ్లి చేస్కో

డార్లింగ్.. ఆ రెండూ చేసేసి పెళ్లి చేస్కో

Published on Oct 23, 2020 11:02 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు అర్థరాత్రి నుండే ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. నిన్న రాత్రి 12 గంటలు దాటిన దగ్గర్నుండి ప్రభాస్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. పుట్టినరోజు సందర్బంగా ఆయన సినిమాల అప్డేట్స్ కోసం అందరూ ఆతురతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా ఈరోజు ‘రాధే శ్యామ్’ నుండి బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ పేరుతో మ్యూజికల్ ట్రీట్ ఒకటి బయటకురానుంది. దాని మీదే ఎక్కువ మంది ఫోకస్ పెట్టారు.

ఇలా సినిమాల అప్డేట్స్ గురించి కొందరు హడావిడి చేస్తుంటే ఇంకొందరు అభిమానులు మాత్రం ప్రభాస్ పెళ్లి విషయాన్ని చర్చకు పెట్టారు. ఎన్నాళ్లగానో ఇదిగో అదిగో అంటూ పుకార్లు రావడమే కానీ ప్రభాస్ పెళ్లి మ్యాటర్ మాత్రం ముందుకుపోలేదు. పైగా ఈ పుట్టినరోజుతో ఆయన 40వ పడిలోకి అడుగు పెడుతున్నారు. దీంతో అభిమానులు డార్లింగ్ ఇకనైనా పెళ్లి చేస్కో డార్లింగ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘రాధే శ్యామ్’ షూటింగ్ దశలో ఉండగా బాలీవుడ్ దర్శక నిర్మాతలతో ‘ఆదిపురుష్’ అలాగే వైజయంతి మూవీస్ బ్యానర్లో చేస్తున్న ఇంకో భారీ ప్రాజెక్ట్ సైన్ చేశారు. ఈ మూడింటిలో రెండు పూర్తయ్యాక అయినా పెళ్లి చేసుకోమని అభిమానులు ఆయనకు సలహా ఇస్తున్నారు. మరి ప్రభాస్ వారి తియ్యని సలహాను ఎంతవరకు వింటారో చూద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు