ఎన్టీఆర్ నటనకు మరోసారి ముగ్దులైన అభిమానులు !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే నటనకు పెట్టింది పేరు. చేసే సినిమాల అంతిమ ఫలితాలు ఎలా ఉన్నా ఆయన నటన మాత్రం ఎప్పటికప్పుడు అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ముగ్దుల్ని చేస్తూనే ఉంటుంది. ఇన్నాళ్లు ఆయన నటించిన తీరు ఒక ఎత్తైతే తాజాగా విడుదలైన ‘జై లవ కుశ’ చిత్రంలోని ఆయన కనబరచిన నటన మరొక ఎత్తు. జై, లవ, కుశ వంటి మూడు పాత్రల్లోనూ తారక్ అద్భుతంగా నటించి చిత్రాన్ని తన భుజాల మీదే నిలబెట్టాడు.

సినిమా చూసిన, అభిమానులు, ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ఆయన నటనను ఎంతగానో కీర్తిస్తున్నారు. ముఖ్యంగా ప్రతినాయకుడి ఛాయలు కలిగిన జై పాత్రను తెరపై ఆవిష్కరించిన తీరుకు ఫిదా అయిపోయారు. ఎవరి నోట చుసిన జై మాటే వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నిన్న భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం అభిమానులు మెచ్చే విధంగా ఉందనే ఫీడ్ బ్యాక్ అందుకుంటోంది.

 

Like us on Facebook