పవన్ కు గ్రాండ్ వెల్కమ్ ప్లాన్ చేస్తున్న అభిమానులు !


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నెల 9న యూఎస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. 9 వ తేదీ నుండి మొదలైన ఆయన పర్యటన దిగ్విజయంగా ముగిసింది. అక్కడి తెలుగు వారిని ఉద్దేశించి పవన్ చేసిన ప్రసంగాలు, ఇంటర్వ్యూలు అక్కడి వారినే కాకుండా లోకల్ గా ఉన్న తెలుగువారిని, రాజకీయ పరిశీలకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా న్యూ హ్యామ్ షైర్ లోని నౌషలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పవన్ చెప్పిన తన వ్యక్తిగత విషయాలు ప్రతి ఒక్కరినీ కదిలించగా ఆ తర్వాతి రోజు హార్వర్డ్ యూనివర్సిటీలో దేశ రాజకీయ, సామాజిక పరిస్టుల పట్ల తన సునిశిత అభిప్రాయాలను, తన పార్టీ విధానాలను, ప్రస్తుతమున్న పరిస్థితులను పవన్ స్పష్టంగా వివరించడం అందరినీ ముగ్దుల్ని చేసింది.

ఇలా పవన్ చేపట్టిన పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. దీంతో ఆయన అభిమానులంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. తమ నేత ఆలోచనలను, నిబద్ధతను చూసి ముచ్చటపడిపోతున్నారు. అందుకే ఈరోజు సాయంత్రం 7:30 కు ఇండియా తిరిగిరానున్న పవన్ కు శంషాబాద్ విమానాశ్రయంలో భారీ స్వాగతం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది.

 

Like us on Facebook