అక్కినేని అభిమానులకు టీజర్స్ పండగ!

అక్కినేని అభిమానులకు టీజర్స్ పండగ!

Published on Aug 30, 2015 9:58 AM IST

nagarjuna-family
అక్కినేని అభిమానులకు నిన్న కింగ్ నాగార్జున పుట్టినరోజు సంబరమే కాక, మరెన్నో విశేషాలు తోడై సంబరాలను మరింత పెద్దవి చేశాయి. నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘ఏ మాయ చేశావే’తో క్రేజీ కాంబినేషన్ అనిపించుకున్న గౌతమ్ మీనన్ – నాగ చైతన్యల ‘సాహసం శ్వాసగా సాగిపో’, అక్కినేని తరంలో మూడో తరం నుంచి గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమైన అఖిల్ సినిమా ‘అఖిల్’.. ఇలా అక్కినేని ఫ్యామిలీ హీరోలకు సంబంధించిన మూడు సినిమాల టీజర్స్ నిన్న విడుదలై ఫ్యాన్స్‌కి పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టాయి.

అఖిల్ మొదటి సినిమాపై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలున్న నేపథ్యంలో విడుదలైన టీజర్, ఆ అంచనాలకు అందుకునే రేంజ్‌లోనే సినిమా ఉండనుందనే విషయాన్ని స్పష్టం చేసింది. ఇక సాహసం శ్వాసగా సాగిపో సినిమాపై కూడా క్రేజీ కాంబినేషన్ కావడంతో మంచి అంచనాలుండగా, టీజర్ విడుదలయ్యాక ఈ కాంబినేషన్ మరోసారి హిట్ కొట్టడం ఖాయమనే విషయం ఋజువైంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా నిన్ననే పుట్టినరోజు జరుపుకున్న నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇలా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన హీరోల మూడు సినిమాల టీజర్స్ ఒకేరోజు విడుదలై అభిమానులకు నాగార్జున పుట్టినరోజుతో కలుపుకొని డబుల్ సంబరాలనే తెచ్చిపెట్టాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు