‘ధృవ’ రిలీజ్ అయ్యే థియేటర్లలో మెగా అభిమానులకు పండుగే !

‘ధృవ’ రిలీజ్ అయ్యే థియేటర్లలో మెగా అభిమానులకు పండుగే !

Published on Dec 8, 2016 2:25 AM IST

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘ధృవ’ ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తువా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. చరణ్ చివరి రెండు సినిమాలు పరాజయాలు కావడంతో ఈ సినిమా భారీ విజయం సాధించాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. పైగా చరణ్ సినిమా థియేటర్లోకి వచ్చి ఏడాది కావడంతో సినిమాకి భారీ హంగామా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ‘ధృవ’ రిలీజ్ రోజున మెగా అభిమానులకు థియేటర్లో చరణ్ సినిమానే కాకుండా మరో పెద్ద గిఫ్ట్ కూడా ఉంది.

అదే మెగాస్టార్ ‘ఖైధీ నెం 150’ సినిమా టీజర్. ఈ టీజర్ ను రేపు రిలీజ్ చేసి 9న ‘ధృవ’ ప్రదర్శించబోయే ప్రతి థియేటర్లో సినిమాకి ముందు వేయనున్నారు. ఇలా చరణ్ హీరో సినిమాకి ముందు చిరు సినిమా టీజర్ ప్లే చేయడం వలన మెగా అభిమానులకు థియేటర్లో సుమారు మూడు గంటల సేపు పండుగ కానుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ టీజర్ వలన ‘ధృవ’ సినిమాకి కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశముంది. ఎందుకంటే మెగాస్టార్ టీజర్ ప్లస్ మెగాపవర్ స్టార్ సినిమా రెండూ కాంబోలా అభిమానులకు కనువిందు చేయడమే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు