వెంకీ మామ కోసం చైతూ అంత రిస్క్ చేశాడా..!

వెంకీ మామ కోసం చైతూ అంత రిస్క్ చేశాడా..!

Published on Dec 9, 2019 9:22 AM IST

వెంకీ మామ సందడి థియేటర్స్ లో మొదలుకావడానికి కేవలం ఐదురోజుల సమయం మాత్రమే ఉంది. ఈనెల 13న వెంకీ మామ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో మునిగిపోయారు. ముఖ్యంగా హీరో వెంకటేష్, నాగ చైతన్య, మరియు రాశి ఖన్నా వివిధ టీవీ షోలలో పాల్గొంటున్నారు. కాగా వెంకీ మామ చిత్రం కోసం నాగ చైతన్య చాలా రిస్క్స్ చేశారట. నాగచైతన్య ఈ చిత్రంలో కెప్టెన్ కార్తీక్ అనే ఆర్మీ అధికారి పాత్ర చేస్తుండగా, దాని కొరకు కాశ్మీర్ లో గడ్డకట్టే చలిలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారట.

సోన్ మార్గ్, పహల్ గాన్ వంటి మైనస్ డిగ్రీలో చలి కలిగిన ప్రాంతాల్లో గుర్రాలపై వెళ్లి షూట్ చేయడం జరిగింది. కాగా ఈ ఎపిసోడ్ లో వచ్చే సన్నివేశాలు విజువల్ గా అద్భుతంగా ఉంటాయని సమాచారం. దర్శకుడు కె ఎస్ రవీంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి. రాశి ఖన్నాతో పాటు పాయల్ మరో హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు