విశేషాదరణ పొందుతున్న ‘ఫిదా’ ట్రైలర్ !
Published on Jul 18, 2017 1:14 pm IST


మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘ఫిదా’ చిత్రం విడుదలకు ముందు తెచ్చుకోవాల్సిన అటెంక్షన్ ను బాగానే రాబట్టుకుంటోంది. ముందుగా టీజర్, పాటలతో అలరించిన ఈ చిత్ర టీమ్ నిన్న కొత్త ట్రైలర్ ను రిలీజ్ చేసింది. సినిమా ఎలా ఉండబోతోంది సింపుల్ గా వివరించిన ఈ ట్రైలర్లో సాయి పల్లవి నటన, మాటలు, వరుణ్ తేజ్ స్టైల్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

దీంతో ట్రైలర్ 24 గంటల్లోనే మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. తెలంగాణ అమ్మాయికి, ఎన్నారై అబ్బాయికి మధ్య నడిచే ఈ రొమాంటిక్ లవ్ ట్రాక్ ను శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయగా దిల్ రాజు నిర్మించారు. జూలై 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. మరోవైపు వరుణ్ తేజ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందినున్న కొత్త సినిమాకు సిద్దమవుతున్నారు.

ట్రైలర్ కొరకు క్లిక్ చేయండి:

 
Like us on Facebook