‘బాహుబలి’కి ముగింపు పలికేది అప్పుడే !

‘బాహుబలి’కి ముగింపు పలికేది అప్పుడే !

Published on Dec 10, 2016 6:39 PM IST

baahubali-2

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘బాహుబలి’. మొదటి పార్ట్ ‘బాహుబలి ది బిగినింగ్’ అంచనాలకు అందని భారీ విజయాన్ని సాధించడం, సినిమా క్లైమాక్స్ లో బాహుబలి కట్టప్పను ఎందుకు చంపాడు అనే ట్విస్టును జనాల మెదళ్లలో వదిలేయడం వలన రెండవ పార్ట్ ‘బాహుబలి ది కన్ క్లూజన్’ కు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఎంతలా అంటే రెండు రోజుల క్రితం ఒక మీడియా సంస్థ వెల్లడించిన సర్వే ఫలితాల ప్రకారం బాలీవుడ్ లో షారుక్, సల్మాన్, రజనీ లాంటి సూపర్ స్టార్ల సినిమాలున్నా కూడా ప్రేక్షకుల్లో 51 % మంది బాహుబలి 2 రిలీజ్ కోసమే ఆతురతగా ఎదురుచూస్తున్నారని తేలింది.

అంతటి క్రేజ్ ఉన్న ఈ సినిమాని అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, ప్రేక్షకులు ఊహించిన దానికంటే కాస్త ఎక్కువగానే ఉండేలా తీర్చిదిద్దుతున్నారు జక్కన. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు రాగా పూర్తి స్థాయిలో డిసెంబర్ 27 నాటికి షూట్ పూర్తైపోతుందని అంటున్నారు. ఇక ఆ తరువాత విఎఫ్ఎక్స్, ప్రమోషన్స్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుని సినిమా 2017 ఏప్రిల్ నెలలో విడుదలవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు