ఎట్టకేలకు మంచి లక్ష్మి సినిమాకు డేట్ కుదిరింది !

ఎట్టకేలకు మంచి లక్ష్మి సినిమాకు డేట్ కుదిరింది !

Published on Jan 20, 2017 9:39 AM IST

lakshmi-manchu
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘లక్ష్మి బాంబ్ – ఫ్రమ్ శివకాశి’. చిత్రీకరణ పూర్తై చాలా రోజులు కావొస్తున్న ఈ చిత్రాన్ని ముందుగా డిసెంబర్23న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ డిసెంబర్ నెలలో వచ్చిన కరెన్సీ బ్యాన్, ఆ తరువాత ఈ జనవరిలో మొదలైన భారీ సినిమా సందడి కారణంగా ఈ చిత్రం ఈ రెండు నెలలు విడుదలకు నోచుకోలేదు. ఇక చివరగా అన్ని పరిస్థితుల్ని పక్కాగా చెక్ చేసుకున్న నిర్మాతలు ఈ సినిమాను ఫిబ్రవరి 3న రిలీజ్ చేయాలని సంకల్పించారు.

ఫిబ్రవరి 3న లక్ష్మి సోదరుడు విష్ణు ‘లక్కున్నోడు’, నాని ‘నేను లోకల్’ చిత్రాలు కూడా రిలీజవుతున్నాయి. ఈ సినిమా టైటిల్ కు తగ్గట్టే ఇందులో జడ్జిగా కనిపించనున్న మంచు లక్ష్మి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడు కార్తికేయ గోపాల కృష్ణ ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి అందరినీ ఆకట్టుకున్నారు. చంద్రశేఖర్, ఉమా లక్ష్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు