ఇంటర్వ్యూ : నివేత పెతురాజ్ – మొదటి నాలుగు రోజులు శ్రీ విష్ణుతో కాస్త కష్టంగానే అనిపించింది !

ఇంటర్వ్యూ : నివేత పెతురాజ్ – మొదటి నాలుగు రోజులు శ్రీ విష్ణుతో కాస్త కష్టంగానే అనిపించింది !

Published on Nov 22, 2017 4:08 PM IST

రాజ్ కందుకూరి నిర్మాణంలో ‘పెళ్లి చూపులు’ సినిమా తరువాత రూపొందిన ‘మెంటల్ మదిలో’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ నివేత పెతురాజ్ మీడియాతో మాట్లాడారు ఆ విశేషాలు మీకోసం..

ప్ర) మీ నైపథ్యం చెప్పండి ?
జ) నేను పుట్టింది తమిళనాడులో పెరిగింది దుబాయ్ లో అమ్మ తమిళియన్ నాన్న తెలుగువారు. తమిళ్ లో నాలుగు చిత్రాల్లో నటించాను. మెంటల్ మదిలో నా ఫస్ట్ తెలుగు సినిమా.

ప్ర ) మీ సినీ రంగ ప్రవేశం గురించి చెప్పండి ?
జ) 2015 లో దుబాయ్ మిస్ ఇండియాగా సెలెక్ట్ అయ్యాను. ఆ సమయంలో తమిళ్ డైరెక్టర్ నెల్సన్ గారు కాల్ చేసి తన సినిమాలో నటించమని అడిగారు. అది నా మొదటి తమిళ్
సినిమా అలా సినీ రంగంలోకి అడుగుపెట్టాను. సినిమాల్లోకి రాకముందు దుబాయ్ లో కొన్ని కంపెనీలకు మోడలింగ్ చేసాను.

ప్ర) ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది ?

జ)మెంటల్ మదిలో చిత్రంలో నా పాత్ర పేరు ‘స్వేచ్చ’ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ పాత్ర గురించి నాకు చెప్పినప్పుడు చాలా థ్రిల్ అయ్యాను. వాస్తవానికి దగ్గరగా ఉండే పాత్ర అది. ఈ క్యారెక్టర్ లో ఎక్కువగా నటించలేదు ఎందుకంటే సహజంగా ఉంది కాబట్టి. ఈ మూవీ లో సేచ్ఛకు తెలుసు తనకేం కావాలో తను చాలా ఇండిపెండెంట్ గర్ల్.

ప్ర) పాత్రకు మీరే డబ్బింగ్ మీరే చెప్పారా?
జ)తెలుగు బాగా అర్థం అవుతుంది కాని మాట్లాడలేను. తెలుగు నేర్చుకుంటున్నా. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాలనుకున్నాను. కానీ కుదరలేదు. వేరే వాళ్ళు చెప్పారు.

ప్ర) తమిళంలో ఎన్ని సినిమాలు చేశారు ?
జ) తమిళంలో మొత్తం నాలుగు సినిమాలు చేశాను. వాటిలో రెండు సినిమాలు విడుదలయ్యాయి. రెండు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘మెంటల్ మదిలో’ నా ఐదవ సినిమా, తెలుగులో మొదటి సినిమా.

ప్ర) పెళ్లి మీద మీ అభిప్రాయం ?
జ) ప్రేమించి పెళ్లి చేసుకోవడం కంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రేమలో ప్రేమించే వాళ్ళను వెతుక్కోవాలి, వాళ్ళతో డేట్ కు వెళ్ళాలి. అవన్నీ కష్టం.

ప్ర) శ్రీ విష్ణుతో వర్క్ ఎలా ఉంది ?
జ) శ్రీవిష్ణు చాలా మంచివాడు. చాలా తక్కువగా మాట్లాడతాడు. మొదటి నాలుగు రోజులు మాట్లాడుకోకుండా వర్క్ చేయడం కొంచెం కష్టంగానే అనిపించినా ఆ తరవాత కలిసిపోయాం. అతనితో వర్క్ చాలా బాగుంది.

ప్ర) సినిమాలోని మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది కదా ఎలా ఫీలవుతున్నారు ?
జ) ఈ సినిమాకు మ్యూజిక్ చాలా ముఖ్యం. ఎక్కడా ఫోర్స్డ్ మ్యూజిక్ ఉండదు. అంతా సన్నివేశాలకు తగ్గట్టుగానే ఉంటుంది. ఇందులోని అన్ని పాటలు నాకు బాగా నచ్చాయి.

ప్ర) మీ నెక్స్ట్ కమిట్మెంట్స్ ఏంటి ?
జ) తమిళంలో సినిమాలు సైన్ చేస్తున్నాను. తెలుగులో ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాను. ఇక్కడ కూడా నన్ను లుక్స్ పరంగా కాకుండా నటిగా గుర్తించాలని కోరుకుంటున్నాను .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు