నైజీరియన్ భాషలో విడుదలకానున్న తొలి తెలుగు చిత్రం !

నైజీరియన్ భాషలో విడుదలకానున్న తొలి తెలుగు చిత్రం !

Published on Jan 21, 2017 3:13 PM IST

kobbari-matta
తోలి చిత్రం ‘హృదయకాలేయం’ తోనే అందరి దృష్టినీ ఆకర్షించి సదా మీ ప్రేమకు బానిస అంటూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు సంపూర్ణేష్ బాబు. తెలుగు ప్రేక్షకులంతా ఆయనకు బర్నింగ్ స్టార్ అనే బిరుదును కూడా కట్టబెట్టారు. మొదటి సినిమా విజయం ఇచ్చిన స్ఫూర్తితోనే సంపూర్ణేష్ హృదయకాలేయం టీమ్ తో కలిసి ‘కొబ్బరి మట్ట’ పేరుతో కామెడీ ప్రధానాంశంగా మరో చిత్రాన్ని ప్రారంభించారు.

మొదలై చాన్నాళ్ళే కావొస్తున్నా ఇప్పటికీ విడుదలకు నోచుకోని ఈ చిత్రం త్వరలోనే విడుదలకానుంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళ భాషలతో పాటు నైజీరియన్ భాషలో సైతం విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని సంపూర్ణేష్ స్వయంగా తెలిపాడు. ఇప్పటి వరకూ రిలీజైన తెలుగు సినిమాల్లో నైజీరియన్ భాషలో విడుదలవుతున్న మొదటి సినిమా ఇదే కావడంతో ఈ చిత్రానికి ఎక్కడలేని ప్రత్యేకత వచ్చింది. ఈ చిత్రాన్ని రూపక్ రొనాల్డ్సన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇకపోతే సంపూర్ణేష్ మరోచిత్రం ‘వైరస్’ మోషన్ పోస్టర్ కూడా ఈరోజే విడుదలై సందడి చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు