5 నెలలకి ఐదుగురు మెగా హీరోలు !

రాబోయే 5 నెలలు మెగా అభిమానులకి కనువిందు చేయనున్నాయి. ఎందుకంటే ఈ డిసెంబర్ నుండి వరుసగా 5 నెలల పాటు ఐదుగురు మెగా హీరోల సినిమాలు నెలకొకటి చొప్పున విడుదలకానున్నాయి. ఇప్పటికే ఈ డిసెంబర్లో సాయి ధరమ్ తేజ్ ‘జవాన్’ విడుదలకాగా డిసెంబర్ 23న అల్లు శిరీష్ సైంటిఫిక్ థ్రిల్లర్ ‘ఒక్క క్షణం’ రిలీజ్ కానుంది.

అలాగే జనవరిలో అన్నిటికన్నా పెద్ద చిత్రం పవన్ కళ్యాణ్ యొక్క ‘అజ్ఞాతవాసి’ జనవరి 10న సంక్రాతి కానుకగా ప్రేక్షకులకు ముందుకు రానుండగా ఫిబ్రవరిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నూతన దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తొలి ప్రేమ’ ఫిబ్రవరి 9న విడుదలకానుంది.

ఇక మెగా అభిమానులు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న మరొక పెద్ద చిత్రం రామ్ చరణ్ యొక్క ‘రంగస్థలం 1985’ మార్చి నెలలో అవకాశాలుండగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యొక్క దేశభక్తి చిత్రం ‘నా పేరు సూర్య’ ఏప్రిల్ నెలాఖరున సందడి చేయనుంది. ఇలా మెగా హీరోలంతా అభిమానులు, ప్రేక్షకుల కోసం నెలకొక సినిమాతో సిద్ధంగా ఉన్నారు.

 

Like us on Facebook