బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్న ఐదు సినిమాలు !

బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్న ఐదు సినిమాలు !

Published on Oct 21, 2016 9:01 AM IST

telugu-film-indrurie
ప్రతి శుక్రవారం ఎదో ఒక సినిమా ఖచ్చితంగా విడుదలవుతూనే ఉంటుంది. ఒక్కోసారి రెండు మూడు సినిమాలు కూడా రిలీజవుతుంటాయి. కానీ ఈరోజు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఒకేసారి ఐదు సినిమాలు దిగేశాయి. పెద్ద హీరోల సినిమాల రిలీజ్ లేకపోవడంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సినిమాలన్నీ రిలీజయ్యాయి. దీంతో ఈరోజు బాక్సాఫీస్ కళకళలాడుతోంది.

ఈరోజు విడుదలైన వాటిలో పూరి, కళ్యాణ్ రామ్ ల ‘ఇజం’ మినహాయిస్తే మిగతావన్నీ చిన్న సినిమాలే. వీటిలో ‘ఇజం’ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా, కొత్త హీరో, నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా దర్శకుడు పివి గిరి తీసిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘నందిని నర్సింగ్ హోమ్’ కూడా విమర్శకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక రష్మీ నటించిన జామెడీ జానర్ చిత్రం ‘తను వచ్చెనంట’, హర్రర్ థ్రిల్లర్ అదిత్ తరుణ్, పూజా జావెరి జంటగా తెరకెక్కిన ‘ఎల్ 7’ లు అంతంత మాత్రమేనన్న టాక్ తెచ్చుకున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు