ఈ ఏడాది రవి తేజ సినిమా లేనట్టేనా ?
Published on Oct 18, 2016 9:48 am IST

ravi-teja
ఇంతకు మునుపు ప్రతి ఏడాది రిలీజైన సినిమాల్లో ఒకటి లేదా రెండు మాస్ మహారాజా రవి తేజ సినిమాలు ఖచ్చితంగా ఉండేవి. ప్రేక్షకులు కూడా రవితేజ సినిమా కోసం ఎదురుచూసే వారు. అలాంటిది ఈ ఏడాది రవితేజ చిత్రం ఒక్కటి కూడా విడుదల కాలేదు. గత ఏడాది వరుసగా కిక్, బెంగాల్ టైగర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పోందడంతో ఈ ఏడాది రవి తేజ సినిమా ఒక్కటి కూడా పట్టాలెక్కలేదు.

కొద్దిరోజుల క్రితం రవితేజ తనకు ‘పవర్’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన కెఎస్ రవీంద్ర అలియాజ్ బాబి డైరెక్షన్లో ఓ సినిమా దాదాపు కుదిరిపోయింది. ఇందులో హీరోయిన్ గా రాశి ఖన్నాను కూడా ఫిక్సయ్యారు. అన్నీ అనుకున్నట్ట్టు జరిగినా ఈ అక్టోబర్ లో ఈపాటికే ఈ ప్రాజెక్ట్ యొక్క రెగ్యులర్ షూట్ మొదలయ్యుండాలి. కానీ అలా జరగలేదు. ఫిలిం సర్కిల్స్ లో మాత్రం కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమా ఆగిపోయిందని వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం యూనిట్ నుండి అధికారిక సమాచారం వచ్చే వరకూ వేచి చూడాల్సిందే. మరోవైపు అభిమానులు ఈ ఏడాది రవితేజ సినిమా లేనట్టేనా అనుకుంటున్నారు.

 
Like us on Facebook