‘సైరా’ కోసం విదేశాల నుండి జూనియర్ ఆర్టిస్టులు !

‘సైరా’ కోసం విదేశాల నుండి జూనియర్ ఆర్టిస్టులు !

Published on Nov 16, 2017 9:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ డిసెంబర్ 6 నుండి హైదరాబాద్ శివార్లలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి, తెల్లదొరలకి మధ్యన జరిగే పోరాట సన్నివేశాలని తెరకెక్కించనున్నారట. ఈ సన్నివేశాల్లో పర్ఫెక్షన్ కోసం కేవలం బ్రిటీష్ల సైన్యాన్ని తలపించేందుకు విదేశీ జూనియర్ ఆర్టిస్టులను ఉపయోగిస్తారని, అందుకోసమే విదేశాల నుండి సుమారు 200 మంది దాకా ఆరిస్టులను రప్పించనున్నారని వినికిడి.

భారీ వ్యయంతో రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును జాతీయ స్థాయి సినిమాగా తీర్చిదిద్ధేందుకు అమితాబ్ బచ్చన్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్ నటీనటుల్ని ప్రాజెక్టులోకి తీసుకున్నారు. అంతేగాక ఆస్కార్ విజేత ఏ.ఆర్ రెహామన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందివ్వనున్నారు. చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లోనేగాక యావత్ తెలుగు ప్రేక్షకుల్లోను విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు