Like us on Facebook
 
కళ్యాణ్ రామ్ సినిమాలో కొత్త తరహా ఫైటింగ్ కాన్సెప్ట్ !


‘ఇజం’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన నూతన చిత్రం ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. దాంతో పాటే మరింత కొత్తదనం కోసం చిత్ర టీమ్ ఒక కొత్త తరహా కాన్సెప్ట్ తో ఫైటింగ్ ను రూపొందిస్తున్నారట.

ఈ ఫైట్ రెగ్యులర్ యాక్షన్ సన్నివేశాలకు భిన్నంగా ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్ శివార్లలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడిగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అగర్వాల్ నటిస్తుండగా స్టార్ కమెడియన్లు బ్రహ్మానందం, వెన్నెల కిషోర్లు పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భరత్ చౌదరి, విశ్వ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనుంది.

Bookmark and Share