‘శ్రీమంతుడు’కి కొత్త సీన్స్ కలుస్తున్నాయ్!

‘శ్రీమంతుడు’కి కొత్త సీన్స్ కలుస్తున్నాయ్!

Published on Aug 27, 2015 7:31 PM IST

srimanthudu-poster
శ్రీమంతుడు’.. సూపర్ స్టార్ మహేష్ స్టామినాను బాక్సాఫీస్ వద్ద మరోసారి నిరూపించి చూపిన సినిమా. మహేష్ పుట్టినరోజుకు సరిగ్గా రెండు రోజుల ముందు అంటే ఆగష్టు 7న విడుదలైన ‘శ్రీమంతుడు’ మహేష్ కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనంగా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలై మూడో వారమైనా ఇంకా అదే ఊపుతో దూసుకుపోతూ మహేష్ ఫ్యాన్స్‌కు సంబరాలను తెచ్చిపెట్టింది. ఇక తమ సినిమాకు ఈ స్థాయి రెస్పాన్స్ రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగానే ‘శ్రీమంతుడు’ సినిమాలో ఎడిటింగ్ దశలో తీసివేసిన కొన్ని సన్నివేశాలను ఈ శుక్రవారం నుంచి కొత్తగా కలుపుతున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ కొత్త సన్నివేశాలు అభిమానులు, ప్రేక్షకులకు మళ్ళీ కొత్త అనుభూతినిస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఊరిని దత్తత తీసుకొని బాగుపరచడమనే ఓ సందేశాత్మక కథతో రూపొందిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రూపంలోనే కాక, విమర్శకుల వద్ద నుంచి ప్రశంసల వర్షం కురవడం కూడా విశేషంగా కనిపించింది. మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఓ హైలైట్‌గా నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు