ఈ శుక్రవారం కూడా సినిమాల తాకిడి ఎక్కుగానే ఉండనుంది !

గత శుక్రవారం తెలుగు పరిశ్రమలో సుమారు 7 సినిమాలు వరకు విడుదలకాగా ఈ శుక్రవారం కూడా అదే పరిస్థితి పునరావృతం కానుంది. పూర్తైన చిన్న సినిమాలతో సహా, డబ్బింగ్ సినిమాలు, ఒక మోస్తరు సినిమాలు కలుపుకుని దాదాపుగా 7 సినిమాల వరకు రిలీజవుతున్నాయి. వాటిలో నారా రోహిత్, పవన్ మల్లెల ‘బాలకృష్ణుడు’ చెప్పుకోదగిన చిత్రం కాగా శ్రీవిష్ణు నటించిన ‘మెంటల్ మదిలో’ కూడా పాజిటివ్ టాక్ తో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుని విడుదలకు సిద్ధమైంది.

ఇకపోతే భూపాల్ రాజు, ధన్ రాజ్, మనోజ్ నందన్ లు కలిసి నటించిన ‘దేవి శ్రీ ప్రసాద్’ కూడా ఈ వారాన్నే విడుదలకు ఎంచుకోగా ‘ఇప్పట్లో రాముడిలా, సీతలా ఎవరుంటారండీ బాబు, జంధ్యాల రాసిన ప్రేమ కథ’ వంటి చిన్న సినిమాలు, సాయి పల్లవి, దుల్కర్ సల్మాన్ ల మలయాళ సినిమా ‘కాళి’ కూడా తెలుగులో ‘హేయ్ పిల్లగాడా’ కూడా విడుదలకానున్నాయి. అలాగే ‘ప్రతినిధి’ తో రచయితగా మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్ రవి దర్శకత్వం వహించిన ‘నెపోలియన్’ కూడా ఈ శుక్రవారమే రానుంది.

ఇలా వరుస సినిమాలు విడుదలవుతుండటంతో గత వారంలానే ఈసారి కూడా కొన్ని సినిమాలకు థియేటర్ల సమస్య తలెత్తే ప్రమాదముంది.

 

Like us on Facebook