పక్కా ప్లాన్ తో ‘గబ్బర్ సింగ్ 2’

పక్కా ప్లాన్ తో ‘గబ్బర్ సింగ్ 2’

Published on Nov 22, 2014 9:18 AM IST

pawan-kalyan

‘గబ్బర్ సింగ్ 2’ చిత్రం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్ రెడీ చేశారు. కేవలం రెండు షెడ్యూల్స్ లో చిత్రం షూటింగ్ కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ ‘గోపాల గోపాల’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత డిసెంబర్ లో ‘గబ్బర్ సింగ్ 2’ ప్రారంభిస్తారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కొత్త అమ్మాయిను తీసుకోవడానికి కారణం ఇదేనట. స్టార్ హీరోయిన్ అయితే కాల్ షీట్స్ అడ్జస్ట్ కష్టం అవుతుందని కొత్త హీరోయిన్ ను తీసుకున్నారట. ‘అత్తారింటికి దారేది’ విడుదలై ఏడాది దాటింది. ఇక అభిమానులను ఎక్కువ రోజులు వెయిట్ చేయించడం ఇష్టం లేని పవన్, వీలైనంత త్వరగా ‘గబ్బర్ సింగ్ 2’ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు అని సమాచారం. ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి.

పవన్ సరసన అనీష అంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బాబి దర్శకుడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. శరత్ మరార్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రంలో కూడా పవన్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అయితే ఈ సీక్వెల్ కు ‘గబ్బర్ సింగ్’ కథకు ఎటువంటి సంబంధం లేదు. పూర్తిగా కొత్త కథతో ‘గబ్బర్ సింగ్ 2’ రూపొందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు