‘గరుడవేగ, నెక్స్ట్ నువ్వే’ లేటెస్ట్ కృష్ణా కలెక్షన్స్ !
Published on Nov 8, 2017 10:54 am IST

సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన తాజా చిత్రం ‘పిఎస్వి గరుడవేగ’ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అన్ని ఏరియాలతో పాటు కలెక్షన్లకు కీలకమైన కృష్ణా జిల్లాలో సైతం సినిమా చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. మొదటి నాలుగురోజులుగాను రూ.23.62 లక్షల షేర్ ను రాబట్టిన ఈ చిత్రం 5వ రోజు రూ.2.74 లక్షల షేర్ ను వసూలు చేసి మొత్తంగా రూ. 26.36 లక్షల షేర్ ను ఖాతాలో వేసుకుని డిస్ట్రిబ్యూటర్లను లాభాల దిశగా నడిపిస్తోంది.

ఇక రామ్ నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ అయితే 12 రోజులకు కోటి షేర్ ను తాకి మంగళవారం రూ.1.08 కోట్ల షేర్ ను రాబట్టి మొత్తంగా రూ.1.01 కోట్లకు చేరింది. అలాగే ఆది ‘నెక్స్ట్ నువ్వే’ చిత్రం 5వ రోజు రూ.1.30 షేర్ తో ఇప్పటి వరకు రూ. 11.56 లక్షల్ని కలెక్ట్ చేసింది. చివరగా రవితేజ ‘రాజా ది గ్రేట్’ మొదటి వారంలోనే హిట్ గా ప్రకటితమై నిన్నటి వరకు రూ.1.73 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది.

 
Like us on Facebook