భారీ ధర పలికిన బాలకృష్ణ శాతకర్ణి హక్కులు !

భారీ ధర పలికిన బాలకృష్ణ శాతకర్ణి హక్కులు !

Published on Oct 22, 2016 1:28 PM IST

Gautamiputra-Satakarni

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ క్రేజ్ రోజురోజుకూ అమాంతం పెరిగిపోతొంది. ఇప్పటికే ఈ చిత్రం యొక్క నైజాం, సీడెడ్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోగా ఇప్పుడు గుంటూరు, కృష్ణా ధరలు కళ్ళు చెదిరే రేటుకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్తరం యొక్క గుంటూరు జిల్లా హక్కులు రూ. 4.5 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడుపోగా కృష్ణా జిల్లా హక్కులు రూ.3. 6 కోట్లకు అమ్ముడయ్యాయట.

విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ లకు అమాంతమైన స్పందన రావడంతో డిస్ట్రిబ్యూటర్లలో సినిమాపై నమ్మకం బాగా పెరిగింది. అభిమానులు కూడా ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాదిస్తుందని ధీమాగా ఉన్నారు. దర్శకుడు క్రిష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్త్తున్న ఈ చిత్రంలో శ్రియ, హేమా మాలిని లు నటిస్తున్నారు. ఈ సినిమాని 2017 సంక్రాంతి కానుఅక్కగా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు