ఉత్తమ విలన్ కోసం గౌతమి సహాయం

ఉత్తమ విలన్ కోసం గౌతమి సహాయం

Published on Mar 29, 2015 12:10 AM IST

Uttama-Villain03
కమల్ హాసన్ నటించిన ‘ఉత్తమ విలన్’ సినిమా భారీ విడుదలకు సిద్ధపడుతుంది. ఈ చిత్ర తెలుగు వెర్షన్ ఆడియో లాంచ్ కొంతసేపటి క్రితమే హైదరాబాద్ లో విడుదలైంది. సినిమా తారాగానమంతా ఈ వేడుకకు హాజరయ్యారు.

ఈ సినిమాలో కమల్ సన్నిహితురాలు గౌతమి కాస్ట్యూమ్స్ విభాగంలో పనిచేసింది. ఈ వేడుకలో గౌతమి మాట్లాడుతూ ఈ సినిమాలో దుస్తులకోసం చాలా పరిశోధన జరిపినట్టు మొత్తం బృందమంతా బాగా కష్టపడినట్టు తెలిపింది. ముఖ్యంగా స్వాతంత్రం ముందు చిత్రీకరించిన సన్నివేశాలు బాగా వచ్చినట్టు తెలిపింది.

ఈ సినిమాలో కమల్ ద్విపాత్రాభినయం చేసారు. ఘిబ్రన్ సంగీత దర్శకుడు. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు