ఖరారైన ‘గోవిందుడు..’ ఓవర్సీస్ టికెట్స్ రెట్లు.

ఖరారైన ‘గోవిందుడు..’ ఓవర్సీస్ టికెట్స్ రెట్లు.

Published on Sep 23, 2014 12:02 PM IST

govindudu-andarivadele
అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ ఓవర్సీస్ టికెట్స్ రేట్లను ఖారారు చేశారు పంపిణిదారులు. యు.ఎస్.ఏలో ఈ సినిమా ప్రీమియర్ షోలను సెప్టెంబర్ 30వ తేదిన ప్రదర్శిస్తున్నారు. ప్రీమియర్ షో, సెప్టెంబర్ 3న సినిమా టికెట్స్ ధర 18 డాలర్లుగా నిర్ణయించారు. అక్టోబర్ 1 నుండి టికెట్ ధర 15 డాలర్లు ఉంటుందని తెలిపారు. ఈ సినిమాను అమెరికాలో సినీగెలాక్సీ మరియు ఏషియన్ మూవీస్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నాయి.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు