రామ్ చరణ్ గోవిందుడి సెన్సార్ డేట్

రామ్ చరణ్ గోవిందుడి సెన్సార్ డేట్

Published on Sep 20, 2014 2:40 PM IST

Govindudu-Andarivadele

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ పాటని నానక్రాం గూడాలో వేసిన ఓ సెట్లో షూట్ చేస్తున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ సినిమాని అక్టోబర్ 1న దసరా కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

మాకు అందిన తాజా సమాచారం ఈ నెల 21 కల్లా ఈ సినిమాకి చెందిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్ 22 లేదా 23న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ నిర్మాత ఎంతో గ్రాండ్ గా ఉండేలా నిర్మిస్తున్న ఈ సినిమాకి కృష్ణవంశీ డైరెక్టర్. ఇటీవలే విడుదలైన ఆడియోకి, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు