విడుదలైన గీతాంజలి ఫస్ట్ లుక్

విడుదలైన గీతాంజలి ఫస్ట్ లుక్

Published on Apr 18, 2014 1:04 PM IST

Geetanjali
అంజలి నటించిన గీతాంజలి సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు హైదరాబాద్ లో విడుదలైంది. హర్రర్ కామెడీ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించనున్నాడు. అంతేకాక బ్రహ్మానందం, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, మధునందన్ మరియు షకలక శంకర్ ముఖ్య పాత్రధారులు. కోన వెంకట్ స్క్రిప్ట్ ని అందించారు. ఈయనే ఈ సినిమాకు సమర్పకుడుకూడా. రాజ్ కిరణ్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఎం.వి.వి సత్యన్నారాయణ నిర్మాత.

ఈ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చిన వి.వి వినాయక్ మాట్లాడుతూ “కోన వెంకట్ నాకు చాలా రోజుల క్రితమే నాకీ కధను చెప్పాడు. ఎట్టకేలకు సినిమా కార్యరూపం దాల్చనుందని, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని” చెప్పుకొచ్చాడు. తరువాత అంజలి గురించి చెప్పుకోస్తూ ఒక తెలుగు నటి ఇంత మంచి సినిమాలలో నటిస్తున్నందుకు మనం గర్వంగా ఫీల్ అవ్వాలి అని చెప్పాడు

నేను ఇప్పటిదాకా 987 సినిమాలలో నటించాను. నాకు వారి సినిమాలలో అవకాశమిచ్చిన ప్రతీ దర్శకుడికి, నిర్మాతకు నేను రుణపడి వుంటాను అని, నాలో ఉపిరి వున్న చివరి నిముషం వరకూ నేను నవ్విస్తూనే వుంటాను అని బ్రహ్మానందం ఇచ్చిన స్పీచ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు