జెమిని దక్కించుకున్న ‘కార్తికేయ’ శాటిలైట్ రైట్స్

జెమిని దక్కించుకున్న ‘కార్తికేయ’ శాటిలైట్ రైట్స్

Published on Jul 24, 2014 4:35 PM IST

Karthikeya-Latest-Poster

త్పుంగ్ హీరో నిఖిల్ హీరోగా ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన సినిమా ‘కార్తికేయ’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఆగష్టు 1న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేసింది. దీంతో ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ కి మంచి రేటు పలికింది. జెమిని వారు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని దాదాపు 1.4 కోట్లకి సొంతం చేసుకుకున్నారు.

నిఖిల్, స్వాతి జంటగా నటిస్తున్న ఈ సినిమా సూపర్ నాచురల్ పవర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఒక మెడిసిన్ చదువుకునే కుర్రాడికి ఆంధ్ర – తమిళనాడు బార్డర్ లో ఉన్న ఓ గుడికి ఉన్న సంబంధం ఏమిటి అనేది ఆసక్తికరంగా ఉంటుందని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. చండూ మొండేటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి వెంకట శ్రీనివాస్ నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు