కేవలం రూ.999/-కే మహేష్ శ్రీమంతుడు సైకిల్

కేవలం రూ.999/-కే మహేష్ శ్రీమంతుడు సైకిల్

Published on Oct 7, 2015 8:59 AM IST

srimnthudu
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ‘శ్రీమంతుడు’. ఓ సోషల్ మెసేజ్ చుట్టూ పూర్తి కమర్షియల్ అంశాలను అల్లుకుంటూ తెరకెక్కించిన ఈ సినిమా ఆగష్టు 7న మహేష్ బర్త్ డే కానుకగా రిలేజే అయ్యి ఓ పెద్ద హిట్ అయ్యింది. కలెక్షన్స్ పరంగా కూడా టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో సెకండ్ ప్లేస్ ని కొట్టేసింది. ఇది పక్కన పెడితే.. ఈ సినిమాలో మహేష్ బాబు రిచ్ కిడ్ అయినప్పటికీ సింపుల్ గా ఓ సైకిల్ పైన కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేసాడు. అప్పటి నుంచి అభిమానులు అలాంటి సైకిల్స్ కొనడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్ర టీం డైరెక్ట్ గా మహేష్ బాబు వాడిన సైకిల్ నే అమ్మేయనుంది. దాని ధర మూడున్నర లక్షలు. కానీ మీరు రూ. 999/- ఖర్చు చేస్తే చాలు.

వివరాల్లోకి వెళితే.. ఈ చిత్ర టీం iamsrimanthudu.com అనే వెబ్ సైట్ ని క్రియేట్ చేసింది. ఈ వెబ్ సైట్ కి వెళ్లి రూ. 999/- కట్టి మీ పేరుని రిజిష్టర్ చేసుకోవాలి. అలా చేసుకున్న వారి నుంచి లక్కీ డ్రా ద్వారా ఒకరిని ఎన్నిక చేసి వారికి శ్రీమంతుడు సైకిల్ ని బహుకరిస్తారు. విజయదశమి రోజున మహేష్ బాబు స్వయంగా లక్కీ డ్రా ద్వారా విన్నర్ ని అనౌన్స్ చేస్తారు. అలాగే మరికొంతమంది విన్నర్స్ కి మహేష్ బాబుతో ఒక్క రోజు గడిపే అవకాశాన్ని ఇవ్వనుం చాలుది. మరికొంతమందికి ప్రత్యేక బహుమతులు కూడా అందించనుంది. అలాగే నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ మహేష్ బాబు సైన్ చేసిన టీ షర్ట్స్ ఇవ్వనున్నారు. దీనిద్వారా వచ్చిన మొత్తాన్ని పలు సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు ఈ చిత్ర టీం తెలిపింది. మరింకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ వెంటనే రిజిష్టర్ చేస్కొండి, మహేష్ ని కలిసే అవకాశం కొట్టేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు