ఘాజీ మొదటి వారం కలెక్షన్స్ వివరాలు !

ఘాజీ మొదటి వారం కలెక్షన్స్ వివరాలు !

Published on Feb 25, 2017 7:26 PM IST


గత వారం విడుదలైన ఘాజి చిత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం విడుదలై వారం గడచినా మంచి వసూళ్లని రాబడుతోంది. కాగా ఈ చిత్రం మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 9.6 కోట్లు వసూళ్లు చేసింది.

సంకల్ప్ రెడ్డి దర్సకత్వంలో వచ్చిన ఈ చిత్రం హిందీలో కూడా విడుదలయింది. హిందీలో ఈ చిత్రం 25 కోట్ల మార్క్ ని అందుకోవడం విశేషం. ఈ వారం విడుదలైన చిత్రాలకు మిక్స్డ్ టాక్ రావడం ఘాజి కి కలసి వచ్చే అంశమని అంటున్నారు. ఇండియా – పాక్ జలాంతర్గామి వార్ నేపథ్యం లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు