రానా సినిమా విడుదల తేదీ మారింది..!

రానా సినిమా విడుదల తేదీ మారింది..!

Published on Dec 4, 2016 4:10 PM IST

ghazi-date‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా స్టార్ స్టేటస్‌ను కొట్టేసిన రానా, ఓ పక్క ఆ సినిమాకు రెండో భాగమైన ‘బాహుబలి ది కంక్లూజన్’ షూటింగ్‌లో పాల్గొంటూనే మరోపక్క ‘ఘాజీ’ అనే మరో యుద్ధ నేపథ్యంలో నడిచే సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండనున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక తాజాగా ఈ సినిమాకు దర్శక, నిర్మాతలు విడుదల తేదీని ఖరారు చేశారు. మొదట్లో చెప్పినట్లు ఫిబ్రవరి 24న కాకుండా వారం ముందే, అంటే ఫిబ్రవరి 17, 2017నే సినిమాను విడుదల చేస్తున్నారు.

తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను హిందీలో ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. ఇండియాలో మొట్టమొదటి నావికాదళ యుద్ధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాను పీవీపీ సంస్థతో కలిసి మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్  నిర్మిస్తోంది. సంకల్ప్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా, తాప్సీ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు