మహేష్ సినిమాకు గిబ్రాన్ మ్యూజిక్?

మహేష్ సినిమాకు గిబ్రాన్ మ్యూజిక్?

Published on May 27, 2015 10:00 PM IST

mahesh-babu
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. వాళ్ళిద్దరు కలిస్తే ఎలాంటి సినిమాలు వస్తాయన్నది ‘పోకిరి’, ‘బిజినెస్‌మేన్’ సినిమాలతో ఇప్పటికే చూపెట్టేశారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్టోరీని కూడా పూరీ ఫైనల్ చేశారు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

మహేష్-కొరటాల సినిమా పూర్తి కాగానే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కే ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ మొదలుపెట్టనున్నారు మహేష్. ఈ రెండు సినిమాల తర్వాత పూరీ-మహేష్‌ల కాంబినేషన్ సెట్స్‌పైక్ వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ లోపు చిరంజీవి 150వ సినిమాను ఫినిష్ చేయనున్నారు పూరీ జగన్నాథ్. ఇక పూరీ-మహేష్‌ల కాంబినేషన్లో తెరకెక్కే సినిమా ఇప్పట్నుంచే వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

సౌతిండియాలో తాజా సంగీత సంచలనం గిబ్రాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపికైనట్లు తెలుస్తోంది. మహేష్‌కి వీరాభిమని అయిన గిబ్రాన్ మహేష్ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం రావడంతో చాలా హ్యాపీగా ఉన్నాడట. గిబ్రాన్ తెలుగులో జిల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు